lata mangeshkar telugu songs: ప్రపంచంతో పాటు భారతదేశం గర్వించదగిన ప్రముఖ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించినట్టు ఆస్పత్రి వైద్యులు తెలుపుతున్నారు. గత నెల లో కోవిడ్ పాజిటివ్ రావడంతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీక్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజులుగా చికిత్స తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడిందే వార్తలు వచ్చాయి. తాజాగా శనివారం మళ్లీ ఆమె (lata mangeshkar)ఆరోగ్యం మరింత క్షీణించినట్టు బులిటెన్ వస్తుంది.
తెలుగులో పాడింది మూడు పాటలే!
లతా మంగేష్కర్ స్వరం వింటేనే మనసుకు ఎంతో ప్రశాంతత ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమెకు దేవుడు ఇచ్చిన ప్రత్యేక వరం ఆమె స్వరం అని చెప్పవచ్చు. ఆమె భారత దేశంలో ఎన్నో సినిమాలకు పాటలు పాడారు. దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో దాదాపుగా సినీ రంగానికి సంబంధించి అన్ని భాషల్లోనూ పాటలు పాడారు. సుమారుగా లతా మంగేష్కర్ 26,000 వేల పాటలు పాడారు. అయితే తెలుగు(telugu songs)లో మాత్రం మూడు పాటలే పాడారంట. ఆ మూడు పాటలు కూడా ఇప్పటివి కావు. కొన్ని దశాబ్ధాల కిందట సినిమాల్లో పాడిన పాటలు. 1955 సంవత్సరంలో ‘సంతానం’ సినిమాలోని నిదురపోరా తమ్ముడా అనే పాట, ‘దొరికితే దొంగలు’ సినిమాలోని శ్రీ వేంకటేశా అనే పాట, 1988 సంవత్సరంలో ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని తెల్ల చీరకు అనే పాటలు పాడారు. తర్వాత ఆమె మళ్లీ ఏనాడూ తెలుగు సినిమా పాటలు పాడలేదు.

లతా మంగేష్కర్ 1945 సంవత్సరంలో బడీమా సినిమాలోని జననీ జన్మభూమి అనే పాటతో తన కెరీర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తన సినిమా పాటల ప్రపంచంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలు పాడారు. ప్రస్తుతం ఈ తరం వారికి ఆమె పాటలు మామూలుగా నచ్చవచ్చు. కానీ ఈ 50 సంవత్సరాల భారత దేశ సినీ చరిత్రలో ఆమె పాటలు ప్రాణం తీసుకునే వారు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అదే విధంగా 2000 సంవత్సరంలో ఐశ్వర్య రాయ్-షారుక్ ఖాన్ నటించిన మొహబ్బతే సినిమాలో హమ్కో హమీసే చురాలో పాట ఆమె పాడిన పాటల్లో ఫేమస్ అయ్యింది. 2004 సంవత్సరంలో వీర్ జారా సినిమాలో దో పల్ అనే పాట ఇప్పటికే ఎవర్ గ్రీన్‌గా నిలుస్తోంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!