lata mangeshkar property: స్టార్ సింగర్ లతా మంగేష్కర్ చాలా చిన్న వయస్సులోనే పాటలు పాడుతూ భారతీయ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పలు మార్లు ఇంట్లర్వ్యూలో పేర్కొంటూ..తన తండ్రి మరణించడంతోనే పాటలు పాడేందుకు తప్పనిసరై చిత్ర పరిశ్రమలోకి రావాల్సి వచ్చిందని తెలిపారు. తన పాటల రంగంలో సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొని ప్రశంసలు అందుకున్న గాన కోకిలగా చెప్పవచ్చు. మరాఠీ సినిమాలో తొలిసారి సింగర్‌గా పాడారు. ఆ తర్వాత జరిగిన సినీ కెరియర్లో ఊహించని రీతిలో గొప్ప సింగర్‌గా ఎదిగారు. కొన్ని వేల పాటలు పాడి సంగీత ప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచారు లతా మంగేష్కర్ (lata mangeshkar). ఆఖరికి 92 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు.
దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ పలు భాషల్లో ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఒక పాట పాడటానికి లతాజీకి పారితోషికం కూడా భారీగానే ఇచ్చేవారు. 1950 సంవత్సర కాలాల్లోనే ఒక్క పాట పాడేందుకు అప్పట్లో రూ.500 పారితోషికాన్ని అందుకున్నారట. అదే సమయంలో సింగర్‌గా పేరున్న బోంస్లేకి ఒక్క పాటకు రూ.150 మాత్రమే ఇచ్చేవారట.
లతాజీ ఆస్తులు ఎంత?
భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషికం తీసుకున్న లతా మంగేష్కర్ ఆస్తిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రూ.25 లతో ప్రారంభమైన ఆమె సంపాదన ప్రస్తుతం రూ.100 కోట్ల(property)కు పైగా చేరుకుందట. ముంబైతో సహా పలు పెద్ద నగరాల్లో లతా మంగేష్కర్‌కు విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు, విల్లాలు ఉన్నాయట. చనిపోయే నాటికి లతా మంగేష్కర్ ఆస్తుల విలువ సుమారు రూ.200 కోట్లకు పైగా ఉంటుందనేది సమాచారం.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ