large intestine function: జీర్ణ వ్యవస్థ అనగానే ముందుగా జీర్ణాశయమే గుర్తుకొస్తుంది. కానీ పేగులు కూడా దీనిలోని భాగమే. ముఖ్యంగా పెద్ద పేగు చేసే పనుల గురించి చాలా మందికి తెలియదు. సుమారు 6 అడుగుల పొడవుండే ఇది మలినాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యర్థ, మలిన పదార్థాలు శరీరం నుండి బయటకు వెళ్లే ముందు వాటిలోని నీటిని తొలగిస్తుంది. ఆహారంలోని విటమిన్లు, పోషకాలను రక్తం గ్రహించేలా చేయడంతో పాటు విషతుల్యాలు బయటకు వెళ్లటానికీ తోడ్పడుతుంది.
బ్యాక్టీరియా గని!
అంతేకాదండోయ్ పెద్ద పేగు (large intestine) ఓ బ్యాక్టీరియా గని. ఇందులో మంచి బ్యాక్టీరియా దండిగా ఉంటుంది. మన పేగుల్లో సుమాఉ 10 కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని అంచనా. దీనికి మన ఆరోగ్యానికీ అవినాభావ సంబంధముంది. ఇది మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి, కణాల వృద్ధికి, హానికర సూక్ష్మక్రియలను నిలువరించడానికి, వ్యాధికారక క్రిములకు ప్రతిస్పందించేలా రోగ నిరోదక వ్యవస్థకు శిక్షణ ఇవ్వడానికి, కొన్ని రకాల జబ్బుల నివారణకు ఎంతగానో (function)తోడ్పడతాయి.

ఫ్లూ, జలుబు వంటి జబ్బుల బారినపడ్డప్పుడు, యాంటీ బయోటిక్ మందులను తీసుకున్నప్పుడు ఈ మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. దీంతో పెద్దపేగు పనితీరు దెబ్బతింటుంది. గ్రహించలేకపోతే విరేచనాలు తలెత్తుతాయి. అందువల్ల పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
జాగ్రత్తలు ఏమిటి?
పెరుగు వంటి బ్యాక్టీరియాను వృద్ధి చేసే పదార్థాలు తీసుకోవాలి. బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడే పొట్టు తీయని ధాన్యాలు, ఉల్లిపాయలు, ఉల్లికాడలు, వెల్లుల్లి వంటివి తినాలి. పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, వెన్న తీసిన పాల పదార్థాలు, గింజ పప్పులు, విత్తనాలు కూడా పెద్దపేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. పీచు మలం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. అందువల్ల ఆహారం ద్వారా రోజుకు కనీసం 20-25 గ్రాముల పీచు లభించేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు ముఖ్యంగా మాంసం మితంగా తినాలి.

కేలరీలు దండిగా గల పదార్థాలు, తీపి పానీయాలు, ఉప్పు తగ్గించాలి. ఒత్తిడిని నియంత్రణలో ఉంచు కోవాలి. మల విసర్జన ఆపుకోవడం తగదు. మద్యం ఒంట్లో నీరు తగ్గేలా చేస్తుంది. కాబట్టి మద్యం అల వాటు గలవారు దాన్ని మితంగానే తీసుకోవాలి. మద్యం అలవాటు లేనివాళ్లు దాని జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. తగినంత నీరు, ద్రవాలు తీసుకుంటూ ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 50 ఏళ్ల తర్వాత డాక్టర్ సలహా మేరకు ఏడాది ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ