Land Grab Allegations : సీఎస్‌కు చేరిన ఈట‌ల ప్రాథ‌మిక నివేదిక‌

Spread the love

Land Grab Allegations : తెలంగాణ రాష్ట్రంలో 48 గంట‌ల్లో రాజ‌కీయం తీవ్రంగా వేడెక్కింది. అధికార ప‌క్షంలో ఉన్న మంత్రిపైన స్వ‌యంగా సీఎం కేసీఆర్ భూ క‌బ్జాల ఆరోప‌ణ‌ల విష‌యంలో ఉన్న‌త స్థాయి అధికారుల‌తో విచార‌ణ‌కు ఆదేశించ‌డం తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపింది. అంత‌టి తో ఆగ‌కుండా ఆ మంత్రిని ఆరోగ్య శాఖ ప‌ద‌వి తొల‌గించ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారితీస్తోంది.


Land Grab Allegations : ”రాజు త‌లుచుకోవాలే గానీ..” అన్న‌ట్టుగా మంత్రి ఈట‌ల‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై ఆగ‌మేఘాల మీద అధికార యంత్రాంగం క‌దిలింది. తెల్ల‌వారేస‌రికి రెవెన్యూ యంత్రాంగం విచార‌ణ‌కు దిగింది. ఒక రైతుకు పాస్ పుస్త‌కం ఇవ్వాలంటే స‌వాల‌క్ష కార‌ణాలు చూపిస్తూ ఏండ్ల త‌ర‌బ‌డి తిప్పుకునే అధికారులు క్ష‌ణాల్లో అచ్చంపేట‌లో దిగారు. దాదాపుగా 8 ఏండ్ల నుంచి ఒక్క తెల్ల రేష‌న్ కార్డు లేదు. ఆరోగ్యశ్రీ కార్డు లేదు, రోగాల‌తో స‌చ్చిపోతున్నాం..ఎంక్వ‌ యిరీ చేసి కార్డు ఇవ్వండి.. అంటూ మొత్తుకుంటున్నా క‌నిక‌రించ‌ని ప్ర‌భుత్వం..ఈట‌ల వ్య‌వ‌హారంలో మాత్రం జెడ్ స్పీడ్‌లో విచార‌ణ ప్రారంభించారు.

ఎట్ట‌కేల‌కు ప్రాథ‌మిక విచార‌ణ తొలి నివేదిక సీఎస్‌కు చేరింద‌ని అధికార వ‌ర్గాల స‌మాచారం. శ‌నివారం ఉద‌య‌మే మాసాయిపేట మండ‌లం అచ్చంపేట‌కు వెళ్లిన రెవెన్యూ అధికారుల బృందం ప‌లువురు రైతుల‌ను క‌లిసింది. అక్క‌డ భూమి, షెడ్యుల నిర్మాణాల‌ను ఫొటోలతో తీసుకున్నారు. దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్ ద్వారా ప్రాథ‌మిక నివేదిక‌ను సీఎస్‌కు పంపించారు. కేవ‌లం గంట‌ల వ్య‌వధిల్లోనే ఈ నివేదిక సిద్ధ‌మైంది. మ‌రోవైపు కొంత ఆల‌స్యంగా విజిలెన్స్ బృందం విచార‌ణ‌కు దిగింది. విజిలెన్స్ సీఐతో పాటు ప‌లువురు అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. విజిలెన్స్ సీఐని క్షేత్ర‌స్థాయికి పంపించ‌గా, విజిలెన్స్ డీజీతో పాటు ముగ్గురు ఉన్న‌తాధికారులు హైద‌రాబాద్ నుంచి వివ‌రాల‌ను సేక‌రించుకున్నారు. అస‌లే సీఎం కేసీఆర్ ఆదేశాలు కావ‌డంతో, అధికారులు ప‌రుగులు పెడుతున్నారు.

ఉద్ధేశ‌పూర్వ‌కంగానేనా?


మ‌రో వైపు ఈ భూ వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం ఉద్ధేశ‌పూర్వ‌కంగానే హ‌డావుడి చేస్తుంద‌నే ప్ర‌చారం కూడా మొద‌లైంది. ఈ భూమికి సంబంధించిన వివ‌రాలు, జ‌రిగిన ప‌రిణామాల‌న్నీ మెద‌క్ జిల్లా మాజీ క‌లెక్ట‌ర్ ధ‌ర్మారెడ్డి, పూర్వ జాయింట్ క‌లెక్ట‌ర్ న‌గేష్ నుంచి స‌మ‌గ్ర వివ‌రాలు తీసుకున్న త‌ర్వాతే ప్ర‌భుత్వం మీడియాకు లీక్ చేసింద‌నే అభిప్రాయా లున్నాయి. దీన్ని రెగ్యుల‌ర్ చేయాలంటూ మంత్రి ఒత్తిడి తీసుకు వ‌చ్చిన వ్య‌వ‌హారాన్ని మొత్తం ధ‌ర్మారెడ్డి నుంచి సీఎంకే అందించారంటున్నారు. ఈ నేప‌థ్యంలో చాలా కాలం త‌ర్వాత ఆరోప‌ణ‌లు రావ‌డం, దీనిపై ప్ర‌భుత్వం ఏదో హ‌డావుడి చేసి విచార‌ణ‌కు ఆదేశించ‌డం ఒక విధ‌మైన ప్లాన్‌లో భాగ‌మేన‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ప‌ద‌వి నుంచి ఈట‌ల తొల‌గింపు

తెలంగాణ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ నుంచి వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్‌కు బ‌దిలీ చేశారు.ఈ మేర‌కు సీఎం సిఫార్సుకు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ ఆమోదం తెలిపారు. మంత్రి ఈట‌ల‌పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించిన నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి నుంచి బ‌దిలీ చేయ‌డంపై ఈట‌ల స్పందించారు. ఏ శాఖ‌నైనా తీసుకునే అధికారం సీఎంకు ఉంటుంద‌ని.. ఏ మంత్రినైనా తొల‌గించే అధికారం కూడా ఆయ‌న‌కు ఉంటుంద‌న్నారు. మంత్రి ప‌ద‌వి ఉన్నా లేకున్నా వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ తోడుంటాన‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు. అదే విధంగా ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే త‌న‌ప తాడి జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వంద ఎక‌రాల‌ను ఆక్ర‌మించి షెడ్లు క‌ట్టిన‌ట్టు చెబుతున్నార‌ని, వాస్త‌వాల‌న్నీ బ‌య‌ట‌కు రావాల‌ని కోరుతున్న‌ట్టు చెప్పారు. ఇలాంటి చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌లే అస‌హ్యించు కుంటున్నార‌ని, రాబోయే రోజుల్లో త‌గిన మూల్యం చెల్లించుకుంటార‌ని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో ఇక‌పై మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌బోన‌ని ఈట‌ల స్ప‌ష్టం చేశారు. విచార‌ణ‌కు సంబంధించిన పూర్తి నివేదిక వ‌చ్చాకే స్పందిస్తాన‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌రిన్ని ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తే హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, శ్రేణుల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే మాట్లాడ‌తాన‌ని వెల్ల‌డించారు.

KCR vision Golden India: నాడు బంగారు తెలంగాణ నినాదం..నేడు బంగారు భార‌త్ నినాదం!

KCR vision Golden India| హైద‌రాబాద్: కేంద్రంపై పోరు విష‌యంలో త‌గ్గేదేలేంటున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఇన్నాళ్లూ బంగారు తెలంగాణ కోసం పాడుప‌డిన తాను ఇక‌పై బంగారు Read more

Double Bedroom : సీఎం తీవ్ర అస‌హ‌నానికి గురైన వేళ‌!

Double Bedroom : సీఎం కేసీఆర్ కు అధికారులు కోపం తెచ్చిన అనుకోని సంఘ‌ట‌న ఒక‌టి ఆదివారం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌తో ముఖ్య‌మంత్రి తీవ్ర అస‌హానానికి గుర‌య్యారు. Read more

Vaccination : తెలంగాణ‌లో ఇంటి వ‌ద్ద‌కే వ్యాక్సినేష‌న్ | Pulse Polio మాదిరిగా CM Kcr ఆలోచ‌న‌!

Vaccination : తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. దేశంలోనే ఆద‌ర్శ‌వంతంగా ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌నే ఆలోచ‌న‌తో Read more

Telangana Political Waar : మంత్రి ఈట‌ల ఇబ్బందికి కార‌కులెవ్వ‌రు? | minister etela rajender

Telangana Political Waar : మంత్రి ఈట‌ల ఇబ్బందికి కార‌కులెవ్వ‌రు? | minister etela rajender Telangana Political Waar : తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ Read more

Leave a Comment

Your email address will not be published.