lal chowk clock tower జమ్మూ కాశ్మీర్: భారత దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని బుధవారం అపూర్వ మైన ఘట్టం ఆవిష్కృతమైంది. అక్కడ ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని ఘంటా ఘర్(క్లాక్ టవర్)పై త్రివర్ణ పతాకం రెపరెలాడింది. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు స్థానికులు ఈ జెండాను ఎగురవేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లాల్‌చౌక్ ఘంటా ఘర్‌పై జాతీయ పతాకం ఎగురవేయడం ఇదే మొదటిసారి(lal chowk clock tower) అంట.
ఒక క్రేన్ సాయంతో!
లాల్‌చౌక్ ప్రాంతంలో ఎన్జీవోలు, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్థానికులు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. ఇద్దరు స్థానిక యువకులు అయిన సాజిద్ యూసుఫ్ షా, సహిల్ బషీర్‌లు ఒక క్రేన్ సాయంతో క్లాక్ టవర్‌పై వరకూ వెళ్లి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ పాకిస్థాన్ జెండాలు మాత్రమే ఎగిరేవి. శాంతికి భంగం కలిగిస్తూ వచ్చిన పాకిస్థాన్ ప్రేరేపిత వ్యక్తులు ఈ జెండాలు ఎగుర వేసేవారు. 370 అధికరణ రద్దు తర్వాత ఇక్కడ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి.

నయా కాశ్మీర్ అంటే ఏమిటని జనం అడుతున్నారు? ఇవాళ ఎగుర వేసిన త్రివర్ణ పతాకమే నయా కశ్మీర్‌కు అర్థం చెబుతోంది. ఇదే జమ్మూకాశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నది కూడా. మాకు పాకిస్థాన్ జెండాలు అక్కర్లేదు. మేము శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నాం. అని జెండా ఆవిష్కరణ అనంతరం స్థానికుడు ఒకరు తెలిపారు.
లాల్ చౌక్ క్లాక్ టవర్ ప్రాధాన్యత!
కశ్మీర్ రాజకీయాలకు సంబంధించి లాల్ చౌక్ లోని క్లాక్ టవర్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. దేశంలోనే కాకుండా, జమ్మూ కాశ్మీర్‌లోని పెద్ద పెద్ద నేతలు గతంలో క్లాక్ టవర్‌పై జెండా ఎగురవేసే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో స్థానిక యువకుడు సాజిత్ యూసుఫ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో జాతీయ జెండా ఎగరని ప్రాంతం ఇదొక్కటేనని, గతంలో చాలా మంది ప్రయత్నించినప్పటికీ తామే తొలిసారి సక్సెస్ అయ్యామని అన్నాడు. భారతీయులుగా జాతీయ జెండాను ఎగురవేయడం తమకెంతో సంతోషాన్ని కలిగించదని చెప్పారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!