lal bahadur shastri information లాల్‌బహుదూర్ శాస్త్రీ హోం రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కార్లో పనిమీద బయలుదేరి వెళుతున్నారు. మధ్యలో కారుకి ప్రమాదం సంభవించింది. ఆయన కారు దిగి ఆ విషయం ఫిర్యాదు చేయాలని దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌కు నడిచి వెళ్లారు. పోలీసు స్టేషన్లో సమయానికి ఇన్స్పెక్టర్ లేరు. హెడ్‌కానిస్టేబుల్ ఉన్నారు. ప్రమాదం జరిగిందని రిపోర్టు వ్రాసుకోమని అతడికి చెప్పాడు శాస్త్రీజీ.
హోంమంత్రి అని తెలియక!
ఆ కానిస్టేబుల్ నిరాడంబరంగా వచ్చింది హోం మంత్రి(lal bahadur shastri information) అని తెలియక ‘బయట కూర్చోవయ్యా కాసేపు. ఇప్పుడు నాకు ఖాళీ లేదు. నీ పని తరువాత చూస్తాను’ అని అన్నారు. అతడు ఏదో ముఖ్యమైన పనిలో వుండి ఉంటాడని భావించి శాస్త్రీజీ అలాగే వరండాలో బల్లపై కూర్చున్నారు. ఒక గంట గడిచింది. లేచి లోపలికి వెళ్లి ఇన్స్పెక్టర్ ఎక్కడికి వెళ్లారు అన్నాడు ఆయన.
ఆ హెడ్‌కానిస్టేబుల్ ఆయనను ఎగాదిగా చూసి ‘నీకు ఇన్స్పెక్టర్తో పనేమిటి? ఎందుకు ఇన్స్పెక్టరు?’ అని ఇంకా ఏదో అనబోయాడు. ఇంతలో అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చి ఆయనను చూసి వినయంగా శాల్యూట్ చేసి ఆయన ఎందుకు వచ్చారో అని భయపడుతూ నిలబడ్డారు. తనపై అధికారి అలా నిలువునా నీరై పోవడం చూసి ఆ హెడ్కానిస్టేబుల్కి దడా, వణుకూ పట్టుకున్నాయి.

కానీ లాల్ బహుదూర్(lal bahadur shastri) తాను వచ్చిన పని చెప్పి రిపోర్టు వ్రాసుకున్నాక వెళ్లిపోయారు. ఆ వచ్చింది హోం మంత్రి అని తెలిసి నోట మాట రాలేదు ఆ హెడ్ కానిస్టేబుల్‌కి. కానీ ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి మనసులోనే జోహార్లు అర్పించాడు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ