ఎన్టీఆర్ లేని పార్టీ ఉంటే ఏమిటి? లేకుంటే ఏమిటి?
తండ్రి – కొడుకులిద్దరూ పాలు అమ్ముకుంటారేమో ?
lakshmi Parvathi Comments : Hyderabad : ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని వైసీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి(lakshmi Parvathi) అన్నారు. మున్సిపల్ ఎలక్షన్ల ఫలితాల అనంతరం ఆమె సోమవారం మీడియా ఎదుట మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా తాను పడ్డ కష్టాలన్నీ మరిచిపోయానని, అవమానాలు, కన్నీళ్లు ఈ రోజుతో పోయాయనిపించిందని లక్ష్మీ పార్వతి తెలిపారు.
”ఎందుకంటే తెలుగు దేశం పార్టీ పూర్తిగా ఓడిపోయిందనేది నా ఉద్ధేశ్యం కాదు. ఆ పార్టీని నడిపిస్తున్న వ్యక్తి ఏనాడైతే ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు ను అవమానించి, చెప్పులు వేసి, ఆయన మరణానికి కారకుడైయ్యాడో, ఆయన బ్యాంకు ఖాతాలను స్తంభించేసి, ఆయనను రోడ్డు మీదకు కూడా రాకుండా చేయాలనే ప్రయత్నం చేసి, ఆ పార్టీని అన్యాయంగా లాక్కున్నాడో అప్పుడే నేను అందరికీ చెప్పాను. ఒక అసమర్థుడు, మానవవిలువలు తెలియని అవినీతి పరుడు వ్యక్తి చేతిలోకి ఈ పార్టీ ఎప్పుడైతే పోయిందో, అది భ్రష్టమై పోయింది. మలినమై పోయింది తెలుగు దేశం పార్టీ. ఆ రోజు నేను ఏమాన్నానో ఈ రోజు అక్షరాల అది నిజమైంది.”
”ఎక్కడా.. పంచాయతీలో గానీ, మున్సిపాలిటీలో గానీ, నగర పాలకలో గానీ ఎక్కడా కూడా ఒక్క స్థానం కూడా గెలవ లేని పరిస్థితి ఈ పార్టీని తీసుకొచ్చిన వ్యక్తికి ఇప్పటి కూడా అతనికి ఆత్మవిమర్శ లేదు. ఏం తప్పులు చేశానో, ఎంత మందిని అవమానించానో, ఈ కుటుంబాన్ని రోడ్డున పడేశానో అని కూడా లేకుండా, ఆ మహానుభావుడిని కనీసం బ్రతకనీయకుండా చేశాడు.”

”ఏ ఆశయాల కోసం, ఏ ప్రజల కోసం నా భర్త నందమూరి తారకరామారావు గారు పార్టీని స్థాపించారో, ఆయన ఆశయాలను తుంగలోకి తొక్కి కార్పొరేట్ వ్యక్తులు, శక్తులను ప్రక్కన పెట్టుకుని, కేవలం అవినీతితో వేల కోట్ల ధనాన్ని సంపాదించుకోవడానికి తెలుగుదేశం పార్టీని ఒక ఆయుధంగా వాడుకొని, చివరికి ఈ పార్టీని భ్రష్టు పట్టించాడు. పార్టీకి అండగా ఉన్న బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందర్నీ పార్టీకి దూరం చేసి ఈ రోజు తను ఒక్కడే, తను తన కొడుకు మాత్రమే మిగిలిపోయారు. తన కొడుకును రాజకీయ వారసుడునిగా చూడాలనే ఆశ ఒక్కటే మిగిలిపోయింది. ఇక తెలుగుదేశం పార్టీకి మనుగడ లేదు.”
పాలు అమ్ముకుంటారో, పెరుగు అమ్ముకుంటారో మరి!
”లోకేష్, వాళ్ల నాన్న పాలు అమ్ముకుంటారో, పెరుగు అమ్ముకుంటారో లేకపోతే రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్ముకుంటారో ఆ పరిస్థితిని ఈ పార్టీకి తీసుకొచ్చారు. వాళ్ల పరిస్థితి కూడా అవమానకరంగా ఉంది. నా భర్తకు ఎంత అవమానం చేశారో, అదే అవమానం ఈ రోజు ప్రజల నుంచి వీళ్లకు తగిలింది. ప్రజలు చెప్పిన తీర్పు అద్బుతమైనది. ప్రజా నాయకుడంటే జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు ఏం కావాలో తెలిసిన నాయకుడు, ప్రజల గుండెల్లో ఇంత శాశ్వతమైన స్థానాన్ని నిలుపుకున్న జగన్మోహన్ రెడ్డి ని చూసైనా నేర్చుకోవాలి. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు ఇక అతన్ని, అతని కొడుకును వదిలి పెట్టి రండి. తెలుగు దేశం పార్టీకి మనుగడ లేదు. ఇంకా 30 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డే అధికారంలో ఉంటారు. నన్ను తల్లిలా ఆదరించిన జగన్మోహన్ రెడ్డి ఇలా విజయం సాధించడం ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడుకి 75 ఏళ్లు వచ్చాయి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. నువ్వు చేసిన పాపాలు నీ కొడుకు ద్వారా అనుభవిస్తున్నావు. నందమూరి తారకరామారావు లేని పార్టీ ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి? ” అంటూ లక్ష్మీ పార్వతి ముగించారు.
- Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి
- Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download
- Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమానస్పద మృతి
- Tiger Kid : మద్రాస్ సిమెంట్ క్వారీ సమీపంలో పులి పిల్ల? | Jaggayyapeta Madras Cement Factory
- Aarogyasri పరిధిలో 50 శాతం బెడ్లు అందుబాటులో…Minister Vellampalli Srinivasa Rao