Lady Lunch | ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగినులు తమ ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరికా, సమయం ఉండటం లేదు. సరిగ్గా ఇలాంటప్పుడే ఆరోగ్య సమస్యలు మేమున్నామంటూ బయలుదేరుతాయి. ఆహారంతోనే ఆరోగ్యం అన్న సూత్రాన్ని అనుసరించి ఉద్యోగినుల కోసం కొన్ని లంచ్(Lady Lunch), breakfast ఐడియాలు కొన్ని తెలుసుకుందాం.
break fast ఎలా తీసుకోవాలి
టైమ్ లేదంటూ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం మరిచిపోకూడదు. ఉదయం ఇడ్లీ, దోశె చేసుకునే సమయం లేకపోయినా, వాటిని తీసుకెళ్లడం కుదరకపోయినా, ఈ విధంగా చేసి చూడండి. ముందు రోజు రాత్రి స్పూను శనగలు, స్పూను పెసలు, స్పూను వేరుశనగ పప్పులు ఇతర గింజ ధాన్యాలను నీటిలో నానపెట్టి తెల్లవారి నీటిని వంపేయాలి. వాటికి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి కాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు జత చేసి పైన కొద్దిగా నిమ్మరసం చిలకరించి, పనిచేసుకుంటూనే తినేయవచ్చు.
Soup for lunch
తయారు చేసుకోవడానికి తక్కువ సమయంతో పాటు పూర్తి పోషకాలు కలిగిన వెరైటీ ఆహారం, వీలుంటేవారానికి సరిపడా సూప్‌ను తయారు చేసి ఫ్రీజర్‌లో పెట్టుకుని రోజుకి కొద్ది కొద్దిగా తీసుకొని వేడి చేసుకోవాలి. లంచ్ సమయంలో తినవచ్చు. ఉడికించిన లేదా పచ్చికూరగాయలను ఆఫీసుకు తీసుకువెడితే మధ్య మధ్యలో తీసుకోవచ్చు. వీటిని లంచ్ ముందు లేదా తర్వాత Tea Break సమయంలో తీసుకోండి. వీటితో పాటు కట్ చేసిన కొన్ని పండ్ల ముక్కలను కూడా దగ్గర ఉంచుకోండి. పైవి ఏవీ అందుబాటులో లేకపోతే కొన్ని బిస్కెట్లను ఎప్పుడూ దగ్గర పెట్టుకొండి. పని మధ్య మధ్యలో వీటిని తింటూ ఉండండి.
work distribution చేసుకుంటే మేలు!
వర్కింగ్ ఉమెన్ ఎప్పుడూ కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. పనులు చేసుకునే క్రమంలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. నియమబద్ద ప్రణాళిక ప్రకారం పనులను Timeకి ముగించుకొని ఉద్యోగాలకు హాజరుకావాలి. వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ పని విధానాన్ని అమలుపరిస్తే ఒత్తిడిని బాగా తగ్గించుకోవచ్చు. ఇందులో ప్రధానమైన అంశం పనుల్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం. ఇంటికి కావాల్సిన వస్తువుల్ని తెప్పించుకోవడం.

ఇంట్లో సర్దుకునే పని, Home Work చేయించడం, బ్యాంకింగ్ లావాదేవీలు వంటి పనుల్ని భర్తతో కలిసి ప్లాన్ చేసుకోవడం మేలని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు ఆదేశించినట్టు కాకుండా సమన్వయం చేసుకొంటున్నట్టుగా పనులు చేయించుకుంటే మీ పనులు సులభంగా అయిపోతాయి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!