laddu recipe: లడ్డూ కావాలా నాయనా! అంటూ ఒక అడ్వర్డేజ్‌మెంట్ మీరు చూసే ఉంటారు. లడ్డూ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. లడ్డు తింటే మళ్లీ మరో లడ్డు తినాలనిపిస్తుంటుంది కదా!. స్వీట్ షాప్‌కు వెళితే మనకు ఎక్కువగా తెలిసినది, నచ్చేది లడ్డులే కదా. మరీ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలి. ఇంటిలో తయారు చేసే విధానం ఏమిటి? లడ్డూకు కావాల్సిన దినసులు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి!.
laddu recipe: డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ!
కావాల్సిన పదార్థాలు
బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్ – పావు కప్పు చొప్పున
గసగసాలు – ఒక టేబుల్ స్పూను
యాలకులు పొడి – అర టీ స్పూను
జాజికాయ పొడి – అర టీ స్పూను
గిజంలు తీసిన కర్జూరం – 2 కప్పులు
నెయ్యి – 2 టీ స్పూన్లు
తయారు చేసే విధానం
బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్స్‌ని చిన్న ముక్కలుగా తరిగి స్పూను నేతిలో కొద్ది సేపు వేడించి పక్కనుంచాలి. అదే మూకుడులో మిగతా నెయ్యి వేసి గసగసాలు, చిదిమిన కర్జూరాలు, యాలకుల పొడి, జాజికాయ పొడి ఒకటి తర్వాత ఒకటి కొద్దిసేపు వేగించాలి. తర్వాత ముందు వేగించిన కూడా వేసి బాగా కలిపి దించేయాలి. కొద్ది కొద్ది మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలు చేసుకోవాలి.
నువ్వుల లడ్డు తయారీ
కావాల్సిన పదార్థాలు
నువ్వులు – ఒక కప్పు
వేరు శనగలు – పావు కప్పు
ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు
బెల్లం తురుము – వంద గ్రా.
యాలకుల పొడి – అర టీ స్పూను
తయారు చేసే విధానం
ముందుగా నువ్వులు, వేరు శనగలు విడివిడిగా వేగించి పక్కనుంచాలి. తర్వాత మంట తీసేసి వేడి పెనంలోనే కొబ్బరి తురము కొద్దిసేపు ఉంచాలి. పొట్టు తీసిన వేరు శనగలు, నువ్వులు, కొబ్బరి తురుము ఒక్కొక్కటిగా మిక్సీలో గైండ్ చేస్తూ చివర్లో బెల్లం, యాలకుల పొడి కూడా వేసి తిప్పాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి.
laddu recipe: రాగి లడ్డు తయారీ
కావాల్సిన పదార్థాలు
రాగి పిండి – ఒక కప్పు
బాదం – అర కప్పు
ఓట్స్ – అర కప్పు
సబ్జా గింజలు, అవిశె గింజలు పొడి – పావు కప్పు
యాలకులు – 2
నెయ్యి – పావు కప్పు
బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు
తయారుచేసే విధానం
ఒక టేబుల్ స్పూను నెయ్యిలో రాగి పిండి దోరగా వేగించి పక్కనుంచాలి. తర్వాత బాదం పప్పు, ఓట్స్ విడివిగా వేగించాలి. ఇప్పుడు మంట తీసేసి అదే పాన్‌లో అవిశె పొడి, సబ్జా గింజలను కొద్దిసేపు ఉంచాలి. ఇప్పుడు మిక్సీలో బాదం, ఓట్స్, అవిశె పొడి, సబ్జా గింజలు, యాలకులు, బెల్లం ఒకటి తర్వాత ఒకటి వేస్తూ గ్రైండ్ చేయాలి. చివర్లో రాగిపిండి కలిపి మరోసారి బాగా తిప్పాలి. మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని కరిగించిన నెయ్యి కలుపుతూ లడ్డూలు చుట్టాలి.