Labor unions : రైతుల జీవితంలో మట్టి పోసిన కేంద్రం :
భారత్ బంద్‌ను విజయవంతం చేయండి : కార్మిక సంఘాలు
Labor unions : Khammam: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో రైతుల జీవితాల్లో మట్టిపోస్తున్నదని కావున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 26న నిర్వహించే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టియుసి, ఐఎఫ్ టియు కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి. రఘునాధపాలెం మండలం తాహశీల్దార్ జి. నర్సింహారావు బుధవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ నేతలు, ఏఐటియూసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, ఐఎన్టియుసి ఖమ్మం నగర అధ్యక్షులు యం.డి వై.పాషా, ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యులు పెరబోయిన వెంకన్న మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు.
ఈ చట్టాలు అమలు జరిగితే రైతు నడ్డి విరిగి బజారున పడి, కూలీగా మార్చే మార్గానికి ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు. ఈ చట్టాలను ప్రకటించిన నాటి నుండి రైతులు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నం పెట్టే రైతు మాటలను పెడచెవిన పెట్టి ప్రజలను మోసం చేస్తూ, సున్నం పెట్టే కార్పొరేట్ సంస్థలకు బాసటగా నిలబడుతుందని ఆరోపించారు. మూడు రైతు చట్టాల అమలు మూలంగా రైతు తన భూమి మీద హక్కును కోల్పోయి కార్పొరేట్ దుర్మార్గాలకు బలికావాల్సిన పరిస్థతి ఏర్పడే అవకాశాలు ఏర్పడుతున్నాయన్నారు.


అదే విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ నుంచి పంచాయతీ ఉద్యోగ కార్మిక సిబ్బందికి వర్తించాలని కనీస వేతనం రూ.12 వేలు నిర్ణయించి చెల్లించేలా ప్రభుత్వానికి నివేదిక పంపించి సిబ్బందికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ నెల 26న జరిగే భారత్ బంద్‌కు అందరూ పూర్తి మద్దతు తెలపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పిట్టల మల్లయ్య, గుగులోతు రాందాస్, బి. మంగిలాల్, టి. ప్రసాద్, రాజ్‌గోపాల్, టి. సుధాకర్, బి.రేణుకా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court