Kuwait life indian: కువైట్ ప్రపంచంలోనే ఒక అందమైన ప్రదేశంగా చెప్పవచ్చు. అంతే కాకుండా ఎంతో మంది బతుకుదెరువుకు వెళ్లిన వారికి జీవనోపాధి కల్పిస్తూ పరిస్థితులు మంచిగా ఉంటే నాలుగు రూపాయలు వెనుకేసుకోవడానికి అనువైన దేశంగా చెప్పవచ్చు. కాకపోతే అక్కడ చట్టాలు కూడా కఠినంగానే ఉంటాయి. ఎవరైనా కువైట్ వెళ్లాలన్నా, కువైట్ వెళ్లి బాధలు పడుతున్నా వారు ఏం చేయాలో కొన్ని విషయాలను మెహబూబ్ షరీఫ్ ఓల్గా యూట్యూబ్ ఛానెల్ (Kuwait life indian)నుంచి సేకరించి ప్రాథమికంగా తెలియజేయాలనుకుంటున్నాం.
కువైట్(Kuwait) దేశంలో పని చేయడానికి ఇండియా నుంచి సంవత్సరానికి వందల సంఖ్యలో ప్రయాణమై వెళుతుంటారు. ఇంటిలో ఆర్థిక పరిస్థితి బాగాలేకనో, లేక కువైట్‌లో మన బంధువో, స్నేహితుడో ఉండి మంచిగా వాళ్ల కుటుంబాన్ని చూసుకుంటున్నాడనో తెలిసి మనకూ వెళ్లాలనే ఆశ కలుగుతుంది. కువైట్‌లో పని పనిగా, కారు డ్రైవర్‌గా, ఏదైనా కంపెనీలో వర్కర్‌గా పనిచేయడానికి వెళుతుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్ వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది బాధలు పడి తిరిగి వచ్చిన వారూ ఉన్నారు.

కువైట్‌కు ఎవరైనా ఏజెంట్ ద్వారా, మధ్య వర్తి ద్వారా కొందరు పనికి వెళుతుంటారు. వారు మీకు మంచి జీతం వస్తుంది, ఫుడ్, బెడ్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి. పని 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఇండియాకు తిరిగి రావచ్చు. అని ఇక్కడే వెళ్లాలనుకునే వ్యక్తిని ఆశ చూపించి వెళ్లేలా ప్రోత్సహిస్తారు. దీంతో అప్పో సప్పో చేసి కువైట్ వెళ్లిన తర్వాత ఏజెంట్ చెప్పిన వివరాలకు, అక్కడ ఉన్న పరిస్థితులకు ఒక్కొక్కసారి పొంతన లేక ఇరుకున పడిన వాళ్లూ ఉన్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత వెంటనే కువైట్ యజమాని, లేక కంపెనీ యాజమాన్యం పాస్ పోర్టు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ల దగ్గర పనిచేయడానికి అన్ని నిబంధనలకు ఒకే చెప్పిన వారి వద్ద పనికి వెళతాం కాబట్టి ఇక ఆ రెండు లేదా మూడు సంవత్సరాలు వారి ఆధీనంలోనే పాస్ పోర్టు ఉంటుంది.
కువైట్ వెళ్లిన వారు చాలా మంది అక్కడ ఫుడ్ పెట్టడం లేదనో, హింసిస్తున్నారనో, పని ఎక్కువుగా చేపించించుకుంటున్నారనో బాధపడుతూ ఇండియాకు వెళ్లాలని ఆరాట పడతారు. కానీ డబ్బులు మొత్తం ఖర్చు చేసుకొని అక్కడకు వెళ్లిన తర్వాత చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఇక అక్కడ పని దినాలు చేసిన తర్వాత గానీ మన చేతికి డబ్బులు రావు. అలాని తప్పించుకుని బయటకు పారిపోతే పోలీసులు పట్టుకుని జైల్లో వేస్తారు. కువైట్ యజమానిని అడిగితే పాస్‌పోర్టు ఇవ్వడు. అప్పుడు వారి బాధ వర్ణాతీతంగా మారుతుంది. ఏం చేయాలో తెలియక, ఈ బాధల నుంచి ఎప్పుడు బయట పడాలనో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త భయం లేకుండా ధైర్యంగా ఉండాలి.
Indian Embassy ని సంప్రదించవచ్చు
కువైట్ వెళ్లిన తర్వాత ఇండియాకు రావాలనుకునే వారు మన ఇండియన్ ఎంబసీని సంప్రదించవచ్చు. అక్కడకు వెళ్లి ఇండియా అధికారులను కలిసి మన బాధను వ్యక్త పరిచి ఇండియాకు వెళ్లేందుకు సహకరించాలని కోరవచ్చు. అయితే ఇండియన్ ఎంబసీ దగ్గరకు వెళ్లినప్పుడు వెంటనే పని పూర్తి కాదని చెబుతున్నారు. ఇండియాకు వెళ్లాలనుకునే వారి మీద ముందు అక్కడ ఎలాంటి కేసులు లేకుండా ఉండాలి. ఆ తర్వాత సరిఅయిన కారణం చెప్పాలి. అప్పుడు పేపర్ వర్క్ ఉంటుంది. అది పూర్తి చేయాలి. అలా పూర్తయ్యే సరికి సుమారు 1 నెలా, 2 నెలలు సమయం పట్టొచ్చు. ఎందుకంటే మనలాగే ఇండియాకు వెళ్లాలనుకునే వారు కొన్ని 100 మంది ఇండియన్ ఎంబసీ వద్ద దరఖాస్తు చేసుకొని ఉంటారు కాబట్టి వారి పని అయిన తర్వాత వరుస సంఖ్యలో మిమ్మల్ని పంపిస్తుంటారు.

ఇలా కూడా రావచ్చు.
ఒక వేళ మీరు అత్యవసరంగా ఇండియాకు రావాలంటే మీ దగ్గర కనీసం 45 వేల నుండి 65 వేల రూపాయలు ఉండాలి. అప్పుడు కువైట్‌లోని సంబంధిత పోలీస్ స్టేషన్‌ను సంప్రదించ వచ్చు. పోలీసు వారు ఏమీ అనరు. మిమ్మల్ని రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచుతారు. ఆ తర్వాత మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం టిక్కెట్ రెడీగా ఉంటే ఇండియాకు రెండు మూడు రోజుల్లో పంపిస్తారు. మీకు అప్పటి వరకు మూడు పూటల భోజనం పెడతారు( డబ్బులు తీసుకుంటారనుకుంటా). అదే విధంగా ఇంకా ఏమైనా కావాలనుకుంటే వారు ఏర్పాటు చేస్తారు. కువైట్‌లో నుండి మన వారికి(ఇండియా) ఫోన్ చేసుకోవడానికి అక్కడ ఫోన్లు అందుబాటులో ఉండకపోవచ్చు. కారణం ఏమిటంటే మనం పనికి వెళ్లిన యజమాని గానీ, కంపెనీ గానీ మన ఫోన్లను స్వాధీనం చేసుకుంటుందట. అలా మన దగ్గర ఫోన్ ఉండే పరిస్థితి ఉండదు. ఒక వేళ పోలీసు స్టేషన్ నుంచి ఫోన్ చేయాలంటే అక్కడ ఛార్జి చెల్లించి మాట్లాడవచ్చు. ఏదైనా కువైట్ వెళ్లిన వారు ఎవర్నీ నమ్మవద్దు. వెళ్లానుకునే వారు తప్పకుండా మీ దగ్గర లక్ష రూపాయలు లోపు డబ్బులు అందుబాటులో ఉంచుకోవాలి. వెళ్లిన వారు కూడా డబ్బులు దగ్గర ఉంచుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇండియాకు రావడానికి ఇబ్బంది పడకుండా ఉంటారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ