Kurabalakota Mandal

Kurabalakota Mandal : కుర‌బ‌ల‌కోట‌లో క‌రోనాతో ఒక‌రి మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Kurabalakota Mandal : కుర‌బ‌ల‌కోట‌లో క‌రోనాతో ఒక‌రి మృతి

Kurabalakota Mandal : Chittoor: చిత్తూరు జిల్లా కుర‌బ‌ల‌కోట మండ‌లంలోని క‌రోనాతో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళితే కుర‌బ‌ల‌కోట మండ‌లం(Kurabalakota Mandal) పెద్ద‌ప‌ల్లి పంచాయ‌తీ, ఏరుకుల‌ప‌ల్లెకు చెందిన రామ‌కృష్ణ కుమారుడు రెడ్డిర‌మ‌ణ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా బెంగుళూరులో ఫార్మ‌సీ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా జ్వ‌రం వ‌స్తుండ‌గా మ‌ద‌న‌ప‌ల్లె ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నాడు. అక్క‌డ ప‌రీక్ష‌లో క‌రోనా పాజిటివ్ రావ‌డంతో వెంట‌నే అత‌న్ని తిరుప‌తి స్విమ్స్ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. అక్క‌డ వైద్యులు ప‌రీక్షించి ప‌రిస్థితి విష‌మించ‌డంతో డాక్ట‌ర్లు చెన్నై హాస్పిట‌ల్ కు తీసుకెళ్ల‌మ‌ని చెప్పారు. తిరుప‌తి నుండి చెన్నై తీసుకెళ్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లో రెడ్డిర‌మ‌ణ మృతి చెందిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. మృతి చెందిన రెడ్డి ర‌మ‌ణకి ఆరు నెల‌ల బాబు ఉన్న‌ట్టు తెలిపారు.

చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న క‌రోనా కేసులు

చిత్తూరు జిల్లాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 92 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్టు వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. చిత్తూరు-1, క‌లికిరి -1, కంభంవారిప‌ల్లి -2, మ‌ద‌న‌ప‌ల్లె -4, పాకాల -2, ప‌ల‌మ‌నేరు -1, రామ‌చంద్ర‌పురం -1, రొంపిచెర్ల -1, శ్రీ‌కాళ‌హ‌స్తి -2, త‌వ‌ణంప‌ల్లి -1,తిరుప‌తి -56, తిరుప‌తి రూర‌ల్ -11, వాల్మీకిపురం -2, వెదురుకుప్పం -1, విజ‌య‌పురం -2, ఏర్పేడు -1, ఎర్ర‌వారిపాలెం -3 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు వైద్యులు తెలిపారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *