Kudali Sangameswara Temple | నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని కూడలి (దాములూరు) లొ కోడలు వేంచేసియున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి శివరాత్రి పర్వదినం సందర్భంగా వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కార్యనిర్వ హణాధికారి మునగాల తేజ, చైర్మన్ కనగాల వెంకటేశ్వరరావు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు(Kudali Sangameswara Temple) తెలిపారు.
శివరాత్రి రోజు రాత్రి 10 గంటలకు శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం, కూచిపూడి, భరతనాట్యం, రేలా రే రేలా కార్యక్రమాలు జరుగుతాయని కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పాత్రులు కావలసిందిగా తెలిపారు.
శివరాత్రి పర్వదినాన ఉదయం 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. శ్రీ స్వామి వారి దేవస్థానం నందు గాలిగోపురం నిర్మాణం పునర్నిర్మాణం గావించుటకు నిర్ణయించామని దా తలు సహకరించి తమ విరాళాలను ఆలయం నందు సమర్పించి తగు రసీదు పొందవలసిందిగా వారు ఒక ప్రకటనలో తెలిపారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ