KTR to become Chief Minister of Telangana | కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయితే కేబినెట్‌ మారుస్తారా?

KTR to become Chief Minister of Telangana

Hyderabad‌: తెలంగాణ రాష్ట్ర సీఎం గా మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు (KTR‌) వ‌చ్చే నెల‌లో బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు కోడై కూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల్లో కాస్త టెన్ష‌న్ మొద‌లైందంట‌. సీఎం సీటును కేటీఆర్ అధిష్టించాక ప్ర‌స్తుతం ఉన్న కేబినెట్‌ను మార్చేస్తారా? లేకుంటే కేటీఆర్ కేబినెట్ కే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి ప‌రిపాల‌నా ప‌నులు చూసుకుంటారా అన్న‌ది చ‌ర్ఛ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న‌వారికి కొత్త భ‌యం ప‌ట్టుకుందట‌. ఒక వేళ మంత్రి కేటీఆర్ కొత్త టీంను సిద్ధం చేసుకుంటే అందులో మ‌నం ఉంటామా? లేదా? ప‌్ర‌స్తుత మంత్రి వ‌ర్గంలో మార్పులు చేస్తే మ‌న కుర్చీకి ఎస‌రు వ‌స్తుందా? అన్న బెంగ‌తో మంత్రులు మద‌న‌పడుతున్న‌ట్టు స‌మాచారం.

KTR to become Chief Minister
టిఆర్ఎస్ మీటింగ్‌(ఫైల్‌)

అన్ని శాఖ‌ల రివ్యూలు కేటీఆర్ చేతిలోనే

ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ కేబినెట్‌లో ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుల‌తో పాటు జిల్లాలు, కులాల ప్రాతిప‌దిక‌న మంత్రులు ఉన్నారు. పేరుకు అక్క‌డ కేసీఆర్ సీఎం అయినా అన్ని శాఖ‌ల‌కు సంబంధించి కేటీఆరే గ‌తంలో రివ్యూలు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఏ మంత్రి ప‌నితీరు ఎలా ఉంటుందో కూడా మంత్రి కేటీఆర్ కు తెలుసు. సీఎం అయ్యాక కూడా తండ్రికి మించి పాల‌న ఉండాలంటే, అందులోనూ త‌న మార్క్ చూపించుకోవాలంటే కేబినెట్‌లో సైతం త‌న‌కు అనుకూలంగా ఉండి, అ సంతృప్తుల‌ను బుజ్జ‌గిస్తూ జిల్లాల్లో చ‌క్రం తిప్పేవాళ్ల‌ను టీమ్‌గా ఏర్పాటు చేసుకోవాల్సిందే. వీట‌న్నింటికి సంబంధించి కేటీఆర్ టీమ్ లు వ్యూహాలు అమ‌లు చేస్తుంద‌న్న ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల స‌మాచారంతో కేటీఆర్ కు ద‌గ్గ‌రయ్యేందుకు ప్ర‌స్తుతం ఉన్న మంత్రులతో పాటు పార్టీ నేత‌లు కేటీఆర్ పల్ల‌విని అందుకొని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

మంత్రుల్లో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌!

ఉమ్మ‌డి జిల్లాల ప‌రంగా చూసుకుంటే కేటీఆర్ కు జిల్లా కొక‌రు అత్యంత స‌న్నిహితులు ఉన్నారు. వారిలో కొంద‌రు ఇప్పుడు కేసీఆర్ కేబినెట్‌లో కొన‌సాగుతున్నారు. అయితే తాను సీఎంగా అయ్యాక వీరిని అలాగే కొన‌సాగిస్తారా? లేకుంటే, బుజ్జ‌గించి 2023 ఎన్నిక‌ల్లో మంచి ప‌ద‌వుల ఆఫ‌ర్ తో అసంతృప్తికి గురికాకుండా చేస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం మంత్రుల్లో కొంద‌రిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చి, కేబినెట్ నుంచి త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగినా కేసీఆర్ మాత్రం ఆ ప్ర‌య‌త్నం చేయ‌లేదు.
కొంద‌రు వ్య‌క్తిగ‌తంగా చేసిన త‌లంపులు పార్టీకి చెడ్డ‌పేరు తెచ్చినా మంత్రుల‌తోనే ఫోన్ లో మాట్లాడి మ‌ళ్లీ ఇలాంటి ఇష్యూన్ లేకుండా చూసుకోవాల‌ని చిన్న చుర‌క‌లు అంటించి వ‌దిలేశారు.(సేక‌ర‌ణ: ఘంటారావం దిన‌ప‌త్రిక‌)

KTR to become Chief Minister
తెలంగాణ మంత్ర‌లు (ఫైల్‌)

కానీ ఇప్పుడు వ‌చ్చేది కేటీఆర్. మ‌రి అలాంటి మంత్రులు త‌న టీమ్ లో చేర్చుకుంటారా లేకుంటే న‌మ‌స్కారం చెప్పి, నామినేట‌డ్ పోస్టుతో ఫీల్ కాకుండా చూస్తారా? అన్న‌ది జ‌ర‌గ‌బోయే ప‌రిణామ‌మే. ఒక వైపు కేటీఆర్ సీఎం కావాల‌ని మంత్రులంతా ఆకాశానికి ఎత్తుతుంటే, ఆయ‌న మాత్రం ఎవ‌రిపై ద‌య త‌లుస్తారో? తెలియ‌ని సందిగ్థం ఏర్ప‌డింద‌నేది విశ్లేష‌కులు చెబుతున్నారు. ఏది ఏమైనాప్ప‌టికీ మంత్రి కేటీఆర్ మాత్రం ప‌క్కా ముఖ్య‌మంత్రి అవ్వ‌డం ఖాయం. ఇది పార్టీలో కొంద‌రికి గుడ్ న్యూస్‌, మ‌రికొంద‌రికి బ్యాడ్ న్యూస్‌గా చెప్ప‌వ‌చ్చు.

ఇది చ‌ద‌వండి:క‌రెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్ద‌రు మృతి

ఇది చ‌ద‌వండి:మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్య‌లో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌

ఇది చ‌ద‌వండి:తిరుప‌తి ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌-బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి

ఇది చ‌ద‌వండి:న‌లుగురు త‌మిళ స్మ‌గ‌ర్లు అరెస్టు

ఇది చ‌ద‌వండి: మ‌ళ్లీ రాజ‌కీయాల్లో రాబోతున్న మెగాస్టార్‌!

ఇది చ‌ద‌వండి:స్థానిక ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తున్న బీజేపీ-జ‌న‌సేన పార్టీలు

ఇది చ‌ద‌వండి:హ‌త్య‌కు గురైన స్వామీజీ? వివాద‌మే కార‌ణమా?

ఇది చ‌ద‌వండి:ఈ ఎన్నిక‌ల‌కు మీరు దూరంగా ఉండాలి: ఎస్ఈసీ

Share link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *