COVID Virus : ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు దగ్గించాలని రాష్ట్ర యంత్రంగం అప్రమత్తంగా పనిచేస్తుందని స్టేట్ కోవిడ్ మాండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్ పర్సన్ డాక్టర్ కెఎస్ జవహార్ రెడ్డి అన్నారు. ఆక్సిజన్ విషయంలోనూ, కోవిడ్ టెస్టుల ఫలితాల విషయంలో ఎప్పటికప్పుడు జిల్లాలకు ఆదేశాలు జాగ్రత్తలు చేస్తున్నామన్నారు.
COVID Virus : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్ పర్సన్ డాక్టర్ కెఎస్ జవహార్ రెడ్డి అన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం అధికారులతో పూర్తి స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. టెస్టింగ్ రిజల్స్(testing results) ఏ రోజుకారోజు వచ్చేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా పేషెంట్లకు త్వరిగతిన వైద్య సేవలు మెరుగవుతాయన్నారు. రాబోయే రోజుల్లో 48 గంటల్లో క్షేత్ర స్థాయిలో ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులు చేయాలని అధికారులకు జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రెండ్రోజుల్లో ఆర్టిపిసిఆర్ టిస్ట్(rt pcr test) ద్వారా అన్ని బ్యాక్లాగ్ శాంపిళ్లను క్లియర్ చేయాలన్నారు. ఏడు రోజుల కంటే ఎక్కువ ఉన్న శాంపిళ్లన్నింటినీ భద్రపర్చి శాంపిల్ ఐడి ఎవరైనా కోరినట్టయితే అప్పుడు టెస్ట్ చేయాలన్నారు. కోవిడ్ హాస్పిటల్లో అనేకమంది పేషెంట్లు చిన్నచిన్న సింఫ్టమ్స్(symptoms)తో వచ్చి ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారన్నారు. అలాంటి వారికి ప్రతి పెద్ద హాస్పిటల్ లో ట్రైగింగ్ సెంటర్ నెలకొల్పాలన్నారు.
పేషెంట్‌ను ఐడెంటిపై చేసి అవసరమన వారికి హోమ్ ఐసోలేషన్ లేదా కోవిడ్ కేర్ సెంటర్లో అడ్మిట్ చెయ్యాలన్నారు. కొద్దిగా లక్షణాలున్న పేషెంట్ల నందర్నీ కోవిడ్ కేర్ సెంటర్ కి పంపించి అక్కడ కొన్ని ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. దీంతో మైల్డ్ పేషెంట్స్‌కు తగిన వైద్య సదుపాయం అందజేసిన వారమవుతామన్నారు. ప్రతి జిల్లాలో కనసీం మూడు వేల బెడ్లు కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా సన్నద్ధం చేయాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ల(covid care center)లో ఆక్సిజన్(oxygen) కాన్సెంట్రేట్ లను పెట్టినట్టయితే మైల్డ్ కోవిడ్పేషెంట్లకు చక్కటి సదుపాయం కలిగించి నట్లవుతందన్నారు. ప్రతి జిల్లాలో 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను కల్పించే ప్రయత్నం చేయాలన్నారు.


పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సప్లై
డిఫెన్స్(defense) వారి సహాయంతో వాయు మార్గం ద్వారా ట్యాంకర్లు పంపి ఆక్సిజన్ ను ఒడిశాలోని అంగూల్ లాంటి ప్రదేశాలనుంచి తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. లోకల్‌గా ఉన్న ఇండస్ట్రీస్ తో మాట్లాడి ఇండస్ట్రియల్ గ్యాస్ సిలిండర్‌ను మెడికల్ గ్యాస్ సిలిండర్‌గా మార్చి లోకల్ సప్లై కు అనుగుణంగా వాడుకోవాలన్నారు. బిహెచ్ఇఎల్(bhel) , ఇతర సంస్థలతో మాట్లాడి క్రయోజనిక్ ట్యాంకర్స్ తయారీ విషయంలో వాటి ద్వారా ఆక్సిజన్ సరఫరా విషయంలో తగు చర్యలు త్వరగా తీసుకోవాలన్నారు. కోవిడ్ మృతదేహాల డిస్పోజల్ విషయంలో పూర్తి ప్రోటోకాల్ తయారు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం