Krishna news todayవిజయవాడ: కృష్ణా జిల్లా లో తుఫాను వర్షాల కారణంగా జిల్లా ప్రజలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లల్లో, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజ్ఞప్తి చేశారు. అల్పపీడనం వల్ల ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని నాలుగు డివిజన్ల సబ్కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. జిల్లాలో గత 24 గంటల్లో 11.6 మిల్లీమీటర్ల జిల్లా సగటు వర్షపాతం నమోదైందన్నారు. అత్యధికంగా అవనిగడ్డ మండలంలోని 74.2 ఎంఎం వర్షపాతం నమోదు కాగా నాగాయలంకలో 46.8, మచిలీపట్నంలో 40.6, కోడూరులో 39.2, పామర్రులో 32.4 మోపిదేవి 27.00, చల్లపల్లి లో 26.8, ఘంటసాల మండలంలో 25.2 ఎంఎం వర్షపాతం(Krishna news today) నమోదైంది.
తుఫాను వర్షాలలో ప్రజలు, వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, అధిక నీటి ప్రభావం ఉన్న రోడ్డు బ్రిడ్జిలు, వాగులు, వంకలు, నదులను దాడటానికి ప్రయత్నం చేయవద్దని సూచించారు. మూగజీవాల్ని, పశువులను వాగులు, వంకలు దాటించవదని సూచించారు. వర్షాలలో పాత మిద్దెలు, పాడుబడిన ఇంటి గోడలు, కరెంటు స్థంభాలు, ట్రాన్షర్మార్లు , చెట్ల కింద ఉండొద్దని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులను అప్రమత్తంగా ఉంచుతూ ప్రజలకు నష్టం కలుగ కుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, మెడికల్, త్రాగునీరు, విద్యుత్, రోడ్డు, ఇరిగేషన్, తదితర అధికరులు సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!