Latest news – krishna district :Nandigama: ఆంధ్రప్రదేశ్‌లో రేపు(మంగళవారం) తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. నందిగామ నియోజకవర్గం వీరులుపాడు మండలం పెద్దాపురంలో పోలీసులు తనికీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 2840 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఒక ఆటోలో తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల కోసమే సంబంధిత వ్యక్తులు వీటిని తరిస్తున్నట్టు సమాచారం. 2840 మద్యం సీసాలను సీజ్ చేశారు. అనంతరం ఎస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు :కృష్ణా జిల్లా ఎస్పీ
కృష్ణా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లాలో తొలి విడత ఎన్నికలు తొమ్మిది మండలాల్లో జరుగుతున్నట్టు తెలిపారు. మొత్తం 379 పోలింగ్ లొకేషన్లలో 1830 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. 130 సమస్యాత్మక 83 అత్యంత సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లు గుర్తించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు రెడ్ జోన్ పరిధిలో ఉంటుందన్నారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పర్యటించామని, పరిస్థితులు సమీక్షించినట్టు ఎస్పీ రవీంద్ర బాబు తెలిపారు. తనిఖీల ద్వారా ఒక కోటీ 30 లక్షలకు పైగా నగదు 20 గ్రాముల బంగారం, ఇరవై మూడ కేజీల వెండి, 21,097 మద్యం బాటిళ్లు, 1,682 630 కేజీల నాటుసారా బెల్లం స్వాధీనం చేసుకున్నామన్నారు. 60 వేల మూడు వందల 99 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామన్నారు. ఎన్నికల బందోబస్తులో ఒక వెయ్యి 567 మంది పోలీస్ సిబ్బంది, మరో 1,615 మంది ఇతర విభాగాల సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో 4 కేసులు నమోదు చేశామన్నారు.
ఇది చదవండి: మంత్రి పువ్వాడపైన నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
ఇది చదవండి:పదేళ్లు నేనే సీఎంను! ఇది పక్కా!
ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్
ఇది చదవండి:బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన మాజీ విలేఖరి అరెస్టు
ఇది చదవండి:కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
ఇది చదవండి:10న నల్గొండకు సీఎం కేసీఆర్
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు