Krishan District Latest News: Chicken bets | కోడి పందాల బరులు ధ్వంసం చేసిన పోలీసులు
Krishan District Latest News: Chicken bets | కోడి పందాల బరులు ధ్వంసం చేసిన పోలీసులుMylavaram: సంక్రాంతి పండుగకు కోడి పందాలకు కాలుదువ్వుతున్న పందెం రాయుళ్ల ఆట కట్టించేందుకు జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబు ఆదేశాలు జారీ చేయగా జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కోడి పందాలు వెయ్యాలని చూసినా, నిర్వహించినా, నిర్వహణకు బరులు సిద్ధం చేసినా కటకటాల పాలు తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా రెడ్డిగూడెం , ఏ కొండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగాపురం, గోపాలపురం గ్రామాల్లో కోడి పందాలకు సిద్ధం చేసిన బరులను గుర్తించారు.
నూజివీడు డిఎస్పీ శ్రీనివాసుల ఉత్తర్వుల మేరకు మైలవరం సీఐ శ్రీను, రెడ్డిగూడెం ఎస్సై ఆనంద్‌కుమార్, రెడ్డిగూడెం తహశీల్దార్ శ్రీనివాసులు, సిబ్బంది ఆధ్వర్యంలో పందాల బరులను ధ్వంసం చేశారు. నిర్వహణకు సమకూర్చిన బరులను ట్రాక్టర్ల సహాయంతో దున్నించి పందాలకు వీలు లేకుండా చేశారు. అనంతరం పోలీస్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలంలోని కోడి పందాల బరులు ఎస్సై ఏసోబు ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఏసోబు హెచ్చరించారు. మంగళవారం ఉదయం నుంచే మండలం అంతా తిరుగుతూ బరులు ఏర్పాటు చేసిన వాటిని వెంటనే ధ్వంసం చేస్తున్నారు. కోడిపందాలు బరులు ఎక్కడైనా సిద్ధం చేసినట్టు సమాచారం ఇస్తే వెంటనే వాటిని ధ్వంసం చేస్తామని తెలిపారు. మంగళవారం ఉదయం నుండి నాలుగు చోట్ల కోడిపందాల బరులు ధ్వంసం చేసినట్టు ఎస్సై ఏసోబు తెలిపారు.
ఇది చదవండి : లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లైన్మెన్