Krack Pre Release Event | Ravi Teja speech | shruthi hassan|మాస్ మహారాజా సినిమా Krack వచ్చేస్తోంది!Hyderabad: మహారాజా హీరో రవితేజ తీసిన సినిమా Krack ఫ్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ వేడుకలో సినిమా యూనిట్ పాల్గొంది. చాలా కాలం తర్వాత మాస్ హీరో రవితేజ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. BROCHILL APP ఆధ్వర్యంలో జరిగిన Krack ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.
మాస్మహారాజా 2020 సంవత్సరంలో డిస్కోరాజా సినిమా తీశారు. ఆ తర్వాత నూతన సంవత్సరంలో ప్రేక్షకులను అలరించేందుకు Krack సినిమాతో ముందుకు వస్తున్నారు. పోలీసు పాత్రలో నటించిన హీరోరవితేజ డైలాగ్స్ ఇప్పటికే అభిమానుల అంచనాలను పెంచేశాయి. సంక్రాంతి పండుగకు అలరించేందు రెడీ అవుతున్న Krack సినిమాలో పాటలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మరో విక్రమార్కుడు కనిపించనున్నట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ట్రైలర్లో హీరో రవితేజ ‘చిన్న గ్యాప్ ఇచ్చా..ఈ గ్యాప్‌లో ఎన్ని యాడ్లు వేసుకుంటావో వేసుకో’..అంటూ Krack సినిమా అంచనాలను పెంచేశారు.
ఇప్పటి వరకు లాక్డౌన్ వల్ల సినిమా థియోటర్లు తెరుచుకోని పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే థియోటర్లు తెరుచుకోవడంతో ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు ఆడుతున్నాయి. కానీ ప్రేక్షకులు కరోనా వైరస్ భయం వల్ల వెళ్లలేకపోతున్నారు. ఇక నూతన సంవత్సరంలో సంకాంత్రి పండుగకు పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న వేళ Krack మూవీ కూడా ఆ లిస్టులో ఉంది.


ఒంగోలుకు చెందిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఇప్పటికే డాన్ శీను, బలుపు సినిమాలను సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు Krack సినిమాతో హీరో రవితేజాతో హ్యాట్రిక్ కొట్టనున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిపేందుకు గోపిచంద్ మలినేని మంచి స్టోరీని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. హీరో రవితేజ సినిమాలో మాస్‌తో పాటు కామెడీగా ఎక్కువుగా ఉంటుంది.
డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు పలు సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సైరా, శాతకర్ణి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు డైలాగులు రాశారాయన. ఇప్పుడు Krack సినిమాకు కూడా డైలాగులు రాశారు. ఆ డైలాగులు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఒంగోలు నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడక్కా అంటూ ఓ డైలాగు రాశారు. ఈ డైలాగ్ రవితేజా హావాభావాల తో చెబుతుండటం అభిమానులకు తెగ నచ్చేసింది. రైటర్ వివేక్ రాసిన కథ ద్వారా మరోసారి తన అంచనాలను పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే రవితేజకు ఆరు సినిమాలకు కథలు రాశారు. ఆ సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్‌ను అందుకున్నాయి. పాటల రచయిత కాసర్ల శ్యామ్ రాసిన పాట మాస్ బిర్యాని. ఇది ప్రేక్షకులను, అభిమానులను బాగా అలరిస్తోంది. ఇప్పటికే రవితేజ సినిమాలో చాలా పాటలు రాశారు.
సరస్వతి ఫిలిం బ్యానర్లో వచ్చిన krack సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గోపిచంద్ మలినేని సారథ్యం వహించారు. నిర్మాతగా బి. మధు, సినిమాటోగ్రపీ జెకె విష్ణు, డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కో ప్రొడ్యూసర్‌గా అమ్మి రాజు కనుమిల్లి, ఎడిటింగ్ నవీన్ నోలీ, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎస్ ప్రకాష్, ఫైట్లు రామ- లక్ష్మణ్, లిరిక్స్ రామజోగయ్య శాస్త్రీ, మేకప్ శ్రీనివాస్‌రాజుతో పాటు తదితరులు ప్రాతినిత్యం వహించారు. హీరో రవితేజాతో పాటు హీరోయిన్లు శృతిహాసన్, స్మృతిరాకిని, వరలక్ష్మి శరత్ కుమార్, దేవి ప్రసాద్, పుజిత పొన్నాడ నటించారు. సంగీతం తమన్ అందించారు. ఈ సినిమా జనవరి 9 థియోటర్లలో విడుదల కానుంది.
ఇది చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న టిపిసిసి పోస్టు!