Koushik Reddy: హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలు ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేశారు. కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Koushik Reddy: హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ టికెట్ తనకేనంటూ ఓ నాయుడితో ఆడియో సంభాషణ బయటపడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నోటీసులు అందజేసింది. అదే సందర్భంలో పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
కౌశిక్‌కు మంచి భవిష్యత్ ఉంది: కేసీఆర్
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా కౌశిక్‌రెడ్డి టిఆర్ఎస్లోకి వచ్చారన్నారు. యువనేత కౌశిక్‌రెడ్డి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కౌశిక్ తండ్రి సాయినాథ్‌రెడ్డి తమతో కలిసి పనిచేశారన్నారు. ఆయనకు చిన్న పదవి ఇచ్చి సరిపెట్టబోనని, నాడు చెన్నారెడ్డి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారన్నారు. తెలంగాణ ప్రజాసమితి అప్పట్లోనే 11 ఎంపీ సీట్లు గెలుచుకుందన్నారు. ఎన్టీఆర్ అవకాశమిస్తే ఎమ్మెల్యే అయ్యానని, కష్టపడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పథకం వెనుక ఎంతో మథనం ఉందన్నారు. గొర్రెల పెంపకం విషయంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని సీఎం అన్నారు.
దళిత బంధుపై అపోహలొద్దు!
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎస్సీలు నిరుపేదలగానే ఉన్నారన్నారు. పేదరికం, సామాజిక వివక్షను ఎస్సీలు ఎదుర్కొంటున్నారన్నారు. దళిత బంధు చూసి కొందరికీ బీపీ పెరుగుతోందన్నారు. అలాంటి వారి ధ్యాసంతా ఓటుపైనే ఉందని, ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉందని గుర్తు చేశారు. దళిత బంధు పథకం ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదని అన్నారు. అది కుటుంబ రక్షణకు ప్రత్యేక నిధి అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఈ పథకం ద్వారా రూ.10 లక్షలు నగదు ఇస్తామని, ఆ రూ.10 లక్షలకు లబ్ధిదారే పూర్తి హక్కుదారని కేసీఆర్ అన్నారు. దళిత బంధు లబ్ధిదారులు జన్మలో మళ్లీ పేదరికంలో రారని స్పష్టం చేశారు. తనను విమర్శించిన వారి కళ్లముందే ఇవాళ తెలంగాణ వచ్చిందన్నారు. రైతు బందు పథకంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. విమర్శలను పటాపంచలు చేస్తూ రైతు బంధును విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఎవరు ఏ కులంలో పుడతారో ఎవరికీ తెలియదని, ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఫలానా కులంలో పుడతారా? అని ప్రశ్నించారు. ఊరు, సమాజం బాగుంటే, మనం బాగుంటాం.. అని సీఎం కేసీఆర్ ముగించారు.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్