Koti Santhakalu Udyamam ఖమ్మం : బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మరియు యూవమోర్ఛా రాష్ట్ర శాఖ అధ్యక్షులు భానుప్రకాశ్ పిలుపు మేరకు యువ మోర్చ జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ అధ్వర్యంలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలనీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ హాజరై మొదటి సంతకం చేసి కార్యక్రమాన్ని (Koti Santhakalu Udyamam)ప్రారంభించారు.
నిరుద్యోగులపై kcr సవితి ప్రేమ?
బిజెపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల పై కేసీఆర్ ప్రభుత్వం సవితి ప్రేమ చూపిస్తుంది ..తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో నిరుద్యోగులు విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించారని , కేసీఆర్ ప్రభుత్వనికి 2023 ఎలెక్షన్ లో నిరుద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు . బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ మాట్లాడుతూ నిరుద్యోగుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు నిరుద్యోగుల ఆత్మహత్యలకు దారి తీస్తుందని కేసీఆర్ అసెంబ్లీలో ఎలెక్షన్ జరుగుతున్న నియోజకవర్గ ప్రచార సభలో ఉపన్యాసాలు తప్ప ఉద్యోగ నోటిఫికేషన్ లు ఆచరణ లో సాధ్యం కావడం లేదు .

కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగులరిటైర్మెంట్ వయసు పెంపు విషయంలో పెద్ద తప్పు చేసి నిరుద్యోగుల మరణాలకు కారణము అయ్యిందన్నారు . ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం తీరు మార్చుకొని నోటిఫికేషన్లు జారీ చేయాలని భారతీయ జనతా యూవమోర్ఛా నుండి రాష్ట్ర ప్రభుత్వన్నీ డిమెండ్ చేశారు . ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శలు మునేశ్ , వీరభద్రం, హరీష్ , మంద సరస్వతి , డోకుపర్తి రవీందర్, బోయినపల్లి ప్రభాకర్ , దుద్దుకురి కార్తిక్ , పృథ్వి రాథోడ్, వేల్పుల సుధాకర్, వల్లలా రమేష్, దాసరి శివ, నల్లమాసు శ్రీనివాస్ , తుమ్మ శివ కోటేశ్వరరావు , డికొండ శ్యామ్, గోనెల శివ, జంపా నాయక్, చందు, గోపి , వెంకటేష్ , శర్మ మరియు ప్రధాన కార్యదర్శులు, జిల్లా యువ మోర్చ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ