Kothala Rayudu 2022: కోత‌ల రాయుడు మాట‌ల‌కు షాక్ తిన్న మ‌హారాజా స్టోరీ!

Kothala Rayudu 2022 | ఒక రోజున ఒక వ‌స్తాదు రాజు గారి వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అత‌డు రాజుగారితో రాజా! నేను చాలా బ‌లవంతుణ్ణి. నేను ఒక సారి ఒక ప‌ర్వతాన్ని కూడా పైకి ఎత్తాను. నేను రోజూ వందశేర్ల పాలు తాగుతాను. నేను సింహాల‌తో కూడా పోట్లాడాను అని చెప్పాడు.

ఆ కండ‌లు తిరిగిన వీరుని చూసి రాజుగారు చాల మెచ్చుకున్నారు. ఇటువంటి వీరుడు నా రాజ్యంలో ఉంటే ముందు ముందు చాలా ఉప‌యోగ‌ముంటుంది అనుకొని రాజుగారు అత‌ణ్ణి త‌న కొలువులో ఉద్యోగిగా నియ‌మించారు. నిజానికి ఆ వ‌స్తాదు (Kothala Rayudu 2022) కు ప‌నేమీ ఉండేది కాదు. మితిమీరిన తిండి మెక్క‌డం శుభ్రంగా గుర్రుపెట్టి నిద్ర‌పోవ‌డం ఇట్లా కొన్నాళ్లు గ‌డిచింది.

అక్క‌డ‌కు ద‌గ్గ‌ర‌లో ఒక పెద్ద అడ‌వి ఉంది. రాత్రికాగానే తోడేళ్లు, పెద్ద పులులు వంటి క్రూర జంతువులుఆ రాజ్యంలోనికి ప్ర‌వేశించి అనేక ప‌శువుల్ని మ‌నుషుల్నీ కూడా చంపితిన వేయ‌సాగాయి. ప్ర‌జ‌లు వ‌చ్చి రాజుగారితో త‌మ‌క‌ష్టాల్ని తొల‌గించాల్సిందిగా మొర‌బెట్టుకున్నారు.

రాజుగార్కి వ‌స్తాదు( Kothala Rayudu 2022), అత‌ని సాహ‌స‌కృత్యాలు జ్ఞాప‌కం వ‌చ్చాయి. వెంట‌నే ఆయ‌న వ‌స్తాదును పిలిపించి నీవు ఇదివ‌ర‌కు ఒక ప‌ర్వ‌తాన్ని ఎత్తి అవ‌త‌ల‌ప‌డ‌వేసి న‌ట్టు చెప్పావు. అది నాకు గుర్తుంది. ఇప్పుడు మా రాజ్యంలో అడ‌విలో నున్న పర్వ‌త‌మొక‌టి ఉంది. దాన్ని ఎత్తి ఎక్క‌డైనా ప‌డ‌వేయాలి అని చెప్పారు.

అందుకు అంగీక‌రించాడు వ‌స్తాదు. ఆ రోజున మామూలు కంటే ఎక్కువ తిండితిని బోలెడ‌న్నీ పాలుత్రాగాడు. రాజుగారు, మిగ‌తా ఉద్యోగులూ త‌న వెంట‌రాగా వ‌స్తాదు ఆ ప‌ర్వతం వ‌ద్ద‌కు చేరుకున్నాడు. వెంట‌నే అత‌డు రాజుగారితో మ‌హారాజా! మీ మ‌నుష్యుల చేత ప‌ర్వ‌తాన్ని త్ర‌వించండి. అప్పుడు దానిని పైకెత్తి అవ‌త‌ల‌ప‌డ‌వేస్తాను అన్నాడు. రాజుగార్కి పిచ్చెక్కినంత ప‌నైంది. ప‌ర్వ‌తాన్ని త్ర‌వ్వ‌డ‌మేంటి? పూర్వం నీవే ప‌ర్వ‌తాన్ని ఎత్తిప‌డ‌వేశాన‌ని చెప్పావు క‌దా? అని అడిగాడు రాజుగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *