Korowai tribe people ||మనిషి మాంసం తినే తెగ గురించి తెలుసా? || కొరోవాయి తెగ
Korowai tribe people: ఈ భూమ్మీద ప్రపంచంలోనే అతి భయంకరమైన తెగల జనాభా ఇప్పటికీ ఉన్నారు. వారు మనలాంటి బాహ్య ప్రపంచపు మనుషులతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అలాంటి తెగల వారిని కలుద్దామని వెళ్లిన ఎంతో మంది ప్రాణాలతో బయటకు రాలేదు. వారి జీవన శైలి, ఆచారాలు ఒక్కసారి పరిశీలిస్తే ఒళ్లు గగుర్బుపొడిచే ఆసక్తికరమైన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. వారు నరమాంస భక్షకులు కూడా. వారి తెగకు సంబంధం లేకుండా ఉన్న ఎదుట వ్యక్తి ఎవరు కనిపించినా కనీసం దగ్గరకు రానివ్వకుండా బాణాలు విక్కు పెడుతుంటారు. అలాంటి డేంజరస్ ట్రైబల్ తెగలలో Korowai Tribe ఒకటి.
Korowai Tribe తెగ ఎక్కువుగా ఇండోనేషియా ప్రావిన్స్ యొక్క Papua లోని, ఆగ్నేయ పశ్చిమ Papua లో నివసిస్తూ ఉంటారు. వీరి సంఖ్య దాదాపుగా 3,000 వేల వరకు ఉంది. 1970 సంవత్సరంలో మానవ శాస్త్రవేత్తలు ఈ Korowai Tribe పై అధ్యయనం చేయడం ప్రారంభించారు. Korowai Tribe జనాలకు భూమిమీద ఇతర మనుషులు ఉన్నారనేది తెలియదట. Korowai Tribe తెగకు చెందిన భాష The Awyu – Dumut family ( ఆగ్నేయ పాపువా) కు చెందినదట. డచ్ మిషనరీకి చెందిన శాస్త్ర వేత్త ఒకరు వారి భాషకు సంబంధించి ఒక పుస్తకాన్ని రాశారట.
Korowai Tribe తెగకు చెందిన కుటుంబాలు ఎక్కువుగా దట్టమైన అడువుల్లో ఎక్కువ ఎత్తులో ఉండే చెట్లపైన నివాసం ఏర్పర్చుకొని జీవిస్తుంటారు. 1980 నుండి Korowai Tribe వారు Becking River ఒడ్డున ఉన్న యానిరుమా గ్రామం, ము మరియు ఎంబస్మాన్ ప్రాంతాల్లోనూ, 1987 తర్వాత మాంగోల్, యుఫుఫ్లా(1988), Eilanden River నది ఒడ్డున ఖైఫ్లాంబోలాప్ (1998) అనే గ్రామాలకు వారి నివాసం పాకింది. Korowai Tribe తెగ వారు Sago అనే ఆహారం ఉండే ప్రదేశాల్లో వీరు నివసిస్తున్నారట. ఈ తెగ ఇప్పుడు పొగాకు తాగుతున్నారు.

వీరు శత్రువులను ఎదుర్కొనేందుకు విల్లుంబులు వాడుతుంటారు. వాటితో బాణాలను శత్రువులపై గురిపెట్టి చంపేస్తుంటారు. సుమారు అర కిలోమీటర్ పరిధిలో వారి బాణం గురి తప్పకుండా శత్రువు దేహంలోకి చొచ్చుకెళుతుందట. Korowai Tribe తెగ అత్యంత భయంకరమైన మనుషుల జాతిగా చెప్పవచ్చు. వీరు నరమాంస భక్షకులు. ఎవరైనా వారి స్థలంలోకి వెళ్లినప్పుడు వారిని బాణాలతో చంపేసి తినేవారట. అదే విధంగా వారి తెగలో ఎవరైనా చనిపోతే వారి మాంసాన్ని ఒక పండుగ వేడుకగా చేసుకొని తినేవారట.
Korowai Tribe తెగ వారు ఎక్కువుగా చేపలు వేటాడటం, జంతువులను వేటాడటంలో నైపుణ్యులు. సాగో అనే ఆహారం వీరికి ప్రధానమైనది. వీరు అప్పుడప్పుడు వేడుకలు చేసుకుంటూ నృత్యాలు చేస్తుంటారు. ఇందులో మగ పెద్దవాళ్లు మాత్రమే పాల్గొంటారు. Korowai Tribe తెగ వారికి పెళ్లి అంటే ఏమిటో తెలియదు. వారు ఆ జాతిలోని తల్లి యొక్క సోదరుడి కుమార్తెతో సంయోగ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కంటుంటారు. వీరు ఎక్కువుగా మంత్రవిద్యలను, మూఢనమ్మకాలను బాగా ఆచరిస్తుంటారు.
1974లో పాశ్చాత్య శాస్త్రవేత్తల బృందం పశ్చిమ కొరోవాయి తెగ(Western Korowai) వద్దకు మొట్టమొదటిసారి వెళ్లారు. ఈ శాస్త్రవేత్తల బృందం యాత్రకు శాస్త్రవేత్త పీటర్ వాన్ అర్స్డేల్ నేతృత్వం వహించారు. ఐలాండెన్ నదీ ప్రాంతంలో ఉన్నవీరి వద్దకు 12 కిలోమీటర్ల నడిచి వెళ్లారు. వాస్తవంగా వీరు వారి వద్దకు వెళ్లిన విషయం ఏమిటంటే ఈ తెగల వారు అగ్ని తయారీ ఎలా చేస్తున్నారో పరిశీలించడానికి అంట. వారు మంటను ఎలా తయారు చేసుకుంటున్నారో కొన్ని పరిశోధనలను నమోదు చేసుకున్నారట.
1970 సంవత్సరం చివరిలో డచ్ కు చెందిన కొంతమంది క్రైస్తవ మిషనరీలు కొరోవాయిలో వారి వద్ద నివసించారు. 1980 సంవత్సరంలో ఇండోనేషియాకు చెందిన శాస్త్రవేత్త సుదర్మాన్ జపనీస్ టెలివిజన్ కోసం కొరోవై తెగకు సంబంధించి డాక్యుమెంటరీ చిత్రాలను రూపొందించారట. 1993 సంవత్సరంలో స్మిత్సోనియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కొరోవాయి అనే సంస్థ వారి ట్రీ హౌస్ నిర్మాణాలను పరిశీలించడంతో పాటు, నరమాంస భక్షకత్వంపై దయో గ్రామం ప్రాంతంలో ఒక చిత్ర బృందం డాక్యుమెంటరీ తయారు చేసింది. దీని ఆధారంగానే Lords of the Garden Film సినిమా తీశారట. 1996లో ఆ తెగల ప్రాంతంలో స్థానికంగా క్రైస్తవ సంఘం స్థాపించబడింది. ఆ సంఘానికి సభ్యులు ఆ తెగలనుంచే ఎన్నుకోవడం జరిగింది.
2006 సంవత్సరంలో మే నెలలో ఆస్ట్రేలియా దేశానికి చెందిన టూర్ గైడ్ Paul Raffaele అనే వ్యక్తి సుమారు 60 నిమిషాల పాటు వారిపై నాయకత్వం వహించి, కొన్ని రోజులు చిత్రీకరణ చేశాడట.

తర్వాత టూర్ గైడ్ Paul Raffaele తన 6 ఏళ్ల మేనల్లుడు వా-వా ఖాకువా నరమాంస భక్షకానికి గురయ్యే ప్రమాదముందని గ్రహించిన టూర్ గైడ్ Paul Raffaele తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆ బాహ్యప్రదేశానికి చెందిన ఇండోనేషియా నెట్ వర్క్సిబ్బందిని సంప్రదించాడట. అయితే వారు అతనికి సహాయం చేయడానికి నిరాకరించారట. తర్వాత అక్కడ ప్రభుత్వం కలుగ జేసుకొని ఎలాలోగా వారిని రక్షించారట.2007 సంవత్సరంలో బీబీసీ ఛానెల్ ఆధ్వర్యంలో మార్క్ ఆన్స్టిస్ మొట్టమొదటి సారిగా ఆ తెగవారిని కలుకున్నారు. ఒక డాక్యుమెంటరీ ఆ తెగ జీవన విధానంపై రూపొందించారట. అదే విధంగా 2011 సంవత్సరంలో కూడా బీబీసీ ఛానెల్ ఆ తెగకు సంబంధించి ఒక డాక్యుమెంటరీని చిత్రీకరించారు.
ఇది చదవండి:జీతాల్లేవు..భద్రత లేదు!
ఇది చదవండి:తెలంగాణ కోడలను నేను.. విమర్శకులకు షర్మిలా సమాధానం!
ఇది చదవండి:పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య
ఇది చదవండి: కేసీఆర్ ఒక విలన్: భట్టి విక్రమార్క
ఇది చదవండి:తమిళ స్మగ్లర్ అరెస్టు
ఇది చదవండి:అన్నం తిన్నొచ్చే లోపులో విషాదం మిగిలింది!