Komatireddy Brothers: రాజకీయాల్లో ప్రజలు వేసే ఓట్లు నాయకుడి చరిత్రను తిరగరాస్తాయి. ఒక్క ఓటు చాలు గెలుపు-ఓటమిల స్థానాలను ఎంపిక చేయడానికి, కాబట్టి ఓటుకు ఉన్న విలువ రాజకీయ నాయకుడికి మాత్రమే తెలుసు కాబట్టి, ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా అదే తీరు కనిపించింది. ఇప్పుడు అందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల రాజకీయ పరిస్థితి గురించే చర్చించుకుంటున్నారు.
Komatireddy Brothers – అంతర్మథనంలో కోమటిరెడ్డి సోదరులు?
మునుగోడు ఉప ఎన్నికపై ఓడిపోయిన తర్వాత BJP ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అసలీ ఎన్నికను ఎందుకు తెచ్చినట్టు? TRS పార్టీకి బద్ధ శత్రువుగా వ్యవహరిస్తూ ఆ పార్టీ ఖాతాలో మరొక సీటును చేర్చడం స్వయంకృతాపరాధం కాదా? అనేది అర్థమవుతోంది. ఈ ఎన్నిక రాకుండా ఉంటే గతంలో తెలంగాణలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచిన అంశాన్ని ప్రచారం చేసుకుంటూ మరో ఏడాది గడిచేదని పార్టీ అభిమానులు చెప్పు కుంటున్న మాట. ఇప్పటి వరకు ధీమాగా ఉన్న బీజేపీ మునుగోడులో ఓడిపోవడంతో రాబోయే ఎన్నికల్లో తమదే గెలుపు అని చెప్పుకోలేని పరిస్థితి ఎదురయ్యింది.
రాజగోపాల్ రెడ్డిది మరొక బాధ!
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది మరో బాధ. కాంగ్రెస్‌లో ఉంటే తనకు దక్కిన గౌరవం ఒక ప్రత్యేకం. ఈ మధ్య కాలంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పొసగినా లేకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సోనియాను, రాహుల్ గాంధీని కలవగలిగే వెలుసుబాటు మొన్నటి వరకూ ఉంది. ఇక Congress నాయకత్వంలో ఒక ప్రతిష్టత ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ అవకాశం లేదు. తాను ఓడిపోయిన బిజేపి నాయకుడుగా మిగిలారు. ఇక ఓడిపోయిన వారికి బీజేపీలో విలువ కూడా దక్కదని పలువురు విశ్లేషకులు అంటున్నారు.
వెంకటరెడ్డి ఆవేదన ఏంటది?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికల ఫలితాలు అనంతరం మీడియాకు కనిపించారు. తమ్ముడు ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో, తన రాజకీయ పరిస్థితి సంక్షోభంలో పడుతుందే మోనని ఆవేదనలో పడ్డారు. అయితే తమ్ముడికి (Komatireddy Brothers) ఓట్లు వెయ్యమని కోరుతున్న ఆడియో క్లిప్ ఒకటి వైరల్ అవ్వడంతో, సొంత పార్టీకి ప్రచారం చెయ్యకుండా ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. దీంతో హైకమాండ్‌తో సంబంధాలు తగ్గిపోయాయి.
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నప్పటికీ Jodo Yatra లో రాహుల్ గాంధీని కలిసే ధైర్యం చెయ్యలేకపోయారు. పార్టీకి ప్రచారం చెయ్యకపోడంతో రేవంత్ రెడ్డికి, సాటి కాంగ్రెస్ నాయకులకు కూడా ముఖం చూపించలేని పరిస్థితి ఎదురైందని చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్‌లోనే ఉన్నానని తాను ఎక్కడికీ పోలేదని నిన్న మీడియా ఎదుట చెప్పినప్పటికీ హైకమాండ్ నుండి ఏ వార్త వస్తుందోనని టెన్షన్లో ఉన్నారు.