kitchen Tips | తెలుగింటి ఆడపడుచులు వంటింట్లో ఎక్కువుగా సమయం కేటాయిస్తారు. వారి కుటుంబానికి ఏది కావాలన్నా క్షణాల్లో వండి వడ్డిస్తారు. వారు ఎన్నో ఆహార పదార్థాలు తయారు చేస్తారు. అయినప్పటికీ వంటింటికి సంబంధించి కొన్ని ఉపయోగాలు, చిట్కాల(kitchen Tips)పై అవగాహన లేక వెలిగించే పొయ్యి వద్ద నుండి వడ్డించే ఆహారం వరకు వృథాగా వదిలేస్తారు. అలా కొన్ని సార్లు ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని kitchen Tipsలు తెలియస్తున్నాం. వీటిని చదవి మీకు ఉపయోగకరమైనవి జాగ్రత్తగా పాటించండి.
వంటింటి చిట్కాలు!
వంట చేసేటప్పుడు పూర్తిగా పెద్ద మంట పెట్టకండి. మీరు వండుతున్న పదార్థం ఉడకడం ప్రారంభింగానే మంటను కొద్దిగా తగ్గించండి. ప్రెషర్ Cooker వల్ల ఇంధనం మాత్రమే కాదు. సమయం కూడా ఆదా అవుతుంది. స్టీలు పాత్రల్లో కన్నా, అల్యూమినియం పాత్రల్లో వంట త్వరగా పూర్తవుతుంది. సాద్యమైనంత వరకూ ఇంట్లోనే అందరూ కలిసి Lunch చేయడం మంచిది. దీనివల్ల వండిన పదార్థాలని పదే పదే వేడి చేయనవసరం ఉండదు. పైగా కుటుంబంలో అందరితో కలిసి గడిపేందుకు ఇదో మంచి అవకాశం కూడా.
ఇంట్లో చిత్తు కాగితాలు, న్యూస్ పేపర్స్ వంటివాటిని ఇష్టం వచ్చినట్టు పారేయకుండా, నెలకోసారి చిత్తు కాగితాల కుర్రాడికి అమ్మేయడం వల్ల మీకు ఇంట్లో అడ్డు లేకుండానూ ఉంటుంది. కాగితం తయారీకి ముడిసరకు ఇచ్చినట్టు ఉంటుంది. ఫలితంగా అడవుల నరికివేతని మీరు కొంతైనా అరికట్టి పర్యావరణానికి మీరు కొంత సేవ చేసినట్టవుతుంది. Paper బ్యాగ్స్‌ను ఒక చోట భద్రంగా వుంచినట్లయితే మళ్లీ మళ్లీ వీటిని ఉపయోగించుకోవచ్చు.
ఫ్రిజ్ తలుపులు ఎక్కువ సేపు తెరిచి ఉండచం మంచిది కాదు. తలుపులు తెరవగానే పని చూసుకుని వెంటనే తలుపులు మూసేయండి. కాయకూరలు ఎప్పుడూ ఎక్కువగా సన్నగా, నాజుకుగా తిరగకూడదు. అందువల్ల పోషకాలు నశించే ప్రమాదం ఉంది. అలాగే ఎక్కువ నీటిలో నీ కూరలనూ ఉడికించవద్దు. అందువల్ల ఎన్నో విటమిన్లు నష్టపోకుండా జాగ్రతపడవచ్చు. వండిన కూరలపై కొంచెం నిమ్మరసం వేస్తుంటే వీటిలో కరిగే పోషకాంశాలు నశించి పోవు. అంతే కాకుండా, ఆయా కూరలు యొక్క సహజమైన రంగు, రుచి, వాసనలు అలాగే ఉంటాయి.
kitchen Tips: కూరగాయల చిట్కాలు!
ఏ కూరలు, ఎప్పుడూ రాగి పాత్రలలో వండరాదు. అన్ని కూరలు ఉడికించడానికి Steel పాత్రలే అత్యుత్తమం. దొండకాయలు, కందిపప్పు వంటివి ఉడకడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అప్పుడు కొంచెం, అంటే చిటికెడు వంట సోడా వేసి ఉడికిస్తే తొందరగా ఉడుకుతాయి. అరటికాయలు, వంకాయలు వంటి వాటిని ఎప్పుడూ నీటిలోనే తరగాలి. అంటే ముక్కలుగా తరిగిన అనంతరం నీటిలోనే ఉంచాలి. లేకుంటే అవి నల్లగా మారిపోయే ప్రమాదం ఉంది. మనం అశ్రద్ధ చేసే ములగ ఆకులోనూ, మెంతి కూరలోనూ ఎ విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. సమయానికి కూరలు అందుబాటులో లేకుంటే పెరట్లోనే ములగాకు పప్పులో వేసుకోవచ్చు. ఆ విధంగా ములగాకు నెలకు కనీసం ఒక్క సారైనా తినితీరాలి.