kids story in telugu

kids story in telugu: వ‌ర్షాకాలంలో వ‌డ‌దెబ్బ రాజా! తెలివైన బాలమంత్రి క‌థ‌!

Spread the love

kids story in telugu మీర్జాపురాన్ని కృష్ణ కుమారుడు అనే రాజు పాలించేవాడు. అతడు ఏ ప‌నినీ సాధ్య‌మా కాదా అని ఆలోచించ‌కుండానే త‌న‌కు తోచిన విధంగా మంత్రుల‌కూ భ‌టుల‌కూ ఆజ్ఞ‌లు జారీ చేసేవాడు. ఎవ‌రైనా రాజాజ్ఞ అసాధ్య‌మ‌ని చెబితే వారు ప‌ద‌వి నుంచి త‌ప్పు కోవాల్సిందేన‌ని ఆదేశించేవాడు. అప్ప‌టికే చాలా మంది త‌మ ప‌ద‌వులు పోగొట్టుకున్నారు. ఓసారి కొత్త‌గా చేరిన మంత్రిని పిలిచి త‌న‌కు ఆకుప‌చ్చ రంగు పిల్లి కావాల‌ని (kids story in telugu)అడిగాడు రాజు.

అలాంటి పిల్లిని తీసుకురావ‌డం సాధ్యం కాదంటే.. ఏమ‌వుతుందో మంత్రికి తెలుసు. అందుక‌ని ఓ పిల్లికి ఆకుప‌చ్చ రంగువేసి రాజు ద‌గ్గ‌రికి తెచ్చాడు. దానికి రాజు మంత్రిని మెచ్చుకున్నాడు. ఒక రోజు ఉద‌య‌మే మంత్రిగారికి రాజా వారి నుంచి క‌బురు తెచ్చాడు ఓ భ‌టుడు. ‘మామిడిపండ్లు తీసుకురావాల‌ని రాజుగారి ఆజ్ఞ‌..‘ చెప్పాడా భ‌టుడు. వ‌ర్షాకా లంలో మామిడి పండ్లు ఉండ‌వు. లేవ‌ని చెబితే రాజుగారికి కోపం. ‘పెద్ద చిక్కే వ‌చ్చింది’ అనుకుంటూ విచారంగా కూర్చున్నాడు మంత్రి.

అంత‌లో మంత్రి కుమారుడు తండ్రి దిగాలుగా ఉండ‌టాన్ని చూసి ‘ఎందుకు అంత విచారంగా ఉన్నావు.‘ అని అడిగాడు. విష‌యం చెప్పాడు తండ్రి. కాసేపు ఆలోచించిన మంత్రి కుమారుడు. ‘నాన్నా.. నువ్వు ఇంటి ద‌గ్గ‌రే ఉండు రాజు గారికి మామిడి పండ్లు నేను తీసుకెళ్తాను అని బ‌య‌లుదేరాడు.’ మంత్రి కుమారుడు రాజుగారి ద‌గ్గ‌రికి వెళ్లి.. మామిడి పండ్ల కోసం వెళ్లిన త‌న తండ్రి వ‌డ‌దెబ్బ త‌గిలి మూర్ఛ‌పోయాడ‌నీ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడ‌నీ చెప్పాడు.

ఇది వ‌ర్షాకాలం. అస‌లు ఎండ‌లే లేవు. మీ తండ్రికి వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌డం అసాధ్యం. నువ్వు చెబుతున్న‌ది అబద్ధం’ కోపంగా అన్నాడు రాజు. అవును రాజా మీరు చెప్పింది నిజ‌మే. వ‌ర్షాకాలంలో ఎండ‌లు ఉండ‌వు. అలాగే మామిడి పండ్లు కూడా ఉండ‌వు. అవి వేస‌విలో వ‌చ్చే పండ్ల‌ను మీరిపుడు కావాలంటున్నారు. వాటిని తేవ‌డం మాత్రం అసాధ్యం కాదా విన‌యంగానే అడిగాడు మంత్రి కొడుకు. ఆ జ‌వాబు రాజుని ఆలోచింప‌జేసింది. శెభాష్‌.. ‘మొద‌టిసారి తెలివైన స‌మాధాన‌మిచ్చిన‌వాడ్ని చూశాను.’ అని మంత్రి కుమారుడ్ని మెచ్చుకున్నాడు. అంతే కాదు రాకుమారు డితో స‌మానంగా విద్య‌ల్లో శిక్ష‌ణ‌నిప్పించే ఏర్పాటు చేసి భ‌విష్య‌త్తులో మంత్రిని చేసేందుకు నిశ్చ‌యించాడు.

Telugu old storie: తేలు కుట్టిన దొంగ: ప‌రుల సొమ్ము పాపం వంటిది (స్టోరీ)

Telugu old storie పూర్వం ఒక గ్రామంలో ఇద్ద‌రు స్నేహితులు ఉండేవారు వారిలో ధ‌ర్మ‌య్య స్నేహ‌పాత్రుడు, రామ‌య్య కొంచెం పిసినారి. ధ‌ర్మ‌య్య‌కు సంతానం లేదు. అందుక‌ని అత‌ను Read more

TELUGU FUNNY STORY:బామ్మ‌గారా మ‌జాకా! లాయ‌ర్ల‌కు దిమ్మ‌దిరిగినంత ప‌ని చేసే..!

TELUGU FUNNY STORY ఒక్క చిన్న టౌన్‌లో ఉన్న కోర్టులో ఒక కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఒక బామ్మ గారిని సాక్షిగా పిలిచి బోనెక్కించారు. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ Read more

chandamama kathalu: జంతువుల ప‌ట్ల ప్రేమ‌పై రాజుకి క‌నువిప్పు స్టోరీ

chandamama kathalu | ఒక రాజుకు జంతువులంటే చాలా ప్రేమ‌. ఆయ‌న ఎంత క్రూర మృగాన్ని కూడా హింసించేవాడు కాడు. పై పెచ్చు, నోరు లేని జంతువుల‌ను Read more

Telugu Moral stories: తాడిప‌త్రి బ‌స్‌లో దొంగ‌లు ప‌డ్డారు(ఉపాయం)

Telugu Moral stories | ఒక నాడు రామ‌య్య‌, సోమ‌య్య అనే ఇద్ద‌రు స్నేహితులు ఏదో మాట్లాడుకుని కోవెల కుంట్ల‌లో బ‌స్ ఎక్క‌డి తాడిప‌త్రి(Tadipatri)కి వెళ్ల‌సాగారు. వాళ్లిద్ద‌రిలో Read more

Leave a Comment

Your email address will not be published.