kids growth mindset పది పన్నెండేళ్ల పిల్లలతో తల్లిదండ్రులు ఎంత ఎక్కువుగా మాట్లాడితే అంత మంచిది అంటున్నారు కెనడాకి చెందిన నిపుణులు. ఈ వయసులోపు చిన్నారులు ప్రతి పనిలో గుర్తింపును కోరుకుంటారు. అందుకే వాళ్లు ఏ చిన్న పని చేసినా, సాయం అందించినా తప్పనిసరిగా ప్రశంసించాలి. భోజనం, చదువూ, దుస్తులూ, స్నేహితులూ ఇలా పరిమితమైన అంశాల గురించే కాకుండా, బయటి విషయాల గురించీ చర్చించాలి. వీలైనంత వరకూ వాళ్లతో మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయించాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో చిన్నారులు ఒంటరితనంతో బాధపడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు (kids growth mindset)నిపుణులు.

ముఖ్యంగా ఇద్దరు పిల్లలున్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. పదే పదే ఒక్క బిడ్డనే ఉద్దేశించి మాట్లాడటం, ప్రశంసించడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల మరో చిన్నారి ‘అమ్మ నన్ను సరిగా చూడట్లేదు’ అని చిన్న బుచ్చుకోవడం, ఆత్మన్యూనతకు లోనవడం జరుగుతుంది. పిల్లలతో ఎక్కువ మాట్లాడకపోవడం వల్ల వారు నెట్ చూడటం, వీడియో గేమ్‌లు ఆడటం వంటివి చేస్తుంటారు. కొందరు చిన్నారులకు తమలోని అసంతృప్తిని బయటకు వ్యక్తం చేయడం తెలియక లోలోపలే మదన పడు తుంటారు. ఇలాంటి పరిస్థితి దీర్ఘకాలంలో కొనసాగితే చిన్నారుల్లో ప్రతికూల ఆలోచనలు రేకెత్తుతాయి. అందుకే ఎప్పుడూ ‘హోమ్‌వర్క్ చెయ్’ అనీ, ‘అవి తిను, ఇవి తిను’ అనీ కాకుండా వాళ్లకు ఉత్సహాన్నిచ్చే కథలూ, ఆటల విషయాలూ చెప్పాలనీ స్నేహితుల ఇష్టాయిష్టాల వంటివి అడిగి తెలుసుకోవాలని చెబుతున్నారు మానసిక నిపుణులు.

చిన్నారుల అల్లరి మరీ శ్రుతి మించిందా!
చిన్నారుల అల్లరి వల్ల మీరెంత బాధపడుతున్నారో తెలియజేయండి. మీరు చెప్పినట్టు వింటుంటే మాత్రం వాళ్ల ప్రవర్తనని పొగడండి. అలాగే పిల్లలు చేసిన పనిని ఎప్పుడూ విమర్శించకూడదు. అలాగని అతిగా పొగడకూడదు. నాలుగుసార్లు మెచ్చుకుంటే ఓసారి పొరపాట్లని ప్రస్తావించండి. దీనివల్ల వారు నొచ్చుకోరు. మీరు ఉన్నదున్నట్టు చెబుతున్నట్టు గ్రహిస్తారు. ఏది మంచిదో, ఏది కాదో అర్థమవుతుంది. కొన్నిసార్లు పిల్లలు ముభావంగా కనిపిస్తారు. అలాంటప్పుడు దగ్గరికెళ్లి మాట కలపండి. చెప్పింది విని ఏం ఫరవాలేదు, నేనున్నా అనే ధైర్యాన్నివ్వండి. దీనివల్ల వాళ్లెప్పుడైనా ఒత్తిడీ, ఆందోళనలో ఉంటే మీతో చెప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.

ఎప్పుడైనా బయటికి వెళ్లినప్పుడు అది కావాలనీ ఇది కొనాల్సిందే అన్న తీరులో పేచీ పెడుతున్నారా! మొదట అది కొనడం ఎంత వరకూ అవసరమో, కాదో తెలియజేయండి. అయినా మంకుపట్టు పడితే కొనివ్వనని స్పష్టంగా చెప్పండి. అయితే మీరు సున్నితంగా చెప్పాలి. మీరు అలా అనడంలోని తార్కికతని వాళ్ళకు అర్థమయ్యేలా చేయండి. ఒత్తిడీ, ఆందోళనల నుంచి బయటపడాలంటే జీవితంలో హాస్యం తప్పనిసరి. ప్రముఖ హాస్య నటుల్ని అనుకరించడాన్ని నేర్పించండి. చిన్న చిన్న జోక్స్ చెప్పి వాళ్లూ వాటిని మళ్లీ చెప్పేలా చూడండి. వీటిని స్నేహితుల వద్ద సందర్భోచితంగా ప్రదర్శించేలా ప్రోత్సహంచండి. ఎవరైనా ఆటపట్టించినప్పుడు బాధపడితే వచ్చే నష్టం కన్నా నవ్వితే వచ్చే లాభం ఎక్కువని వివరించండి. ఇవన్నీ జీవితంలో వాళ్లు మంచి పౌరులుగా ఎదగడానికి తోడ్పడేవే!.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి