Kidney Patients in A.konduru | కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలం, చీమలపాడు జాతీయ రహదారి కూడళ్ళ కు దగ్గరలో కిడ్నీ వ్యాధి సమస్యల సాధన పోరాట సమితి అఖిలపక్షం గత మూడ్రోజుల నుండి నిరసనలు, దీక్షలు చేపడుతుంది. శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్షకు హాజరై తమ మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వంలో ఏ కొండూరు కిడ్నీ బాధితులను గుర్తించి నిమ్స్ డైరెక్టర్‌ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చామని దేవినేని అన్నారు. అప్పుడు సుమారు 700 మంది దగ్గర రక్త నమూనాలను స్వీకరించామని తెలిపారు.
Kidney Patients in A.konduru
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. కనుక ఆనాడు చంద్రబాబు నాయుడు గమనించారని అన్నారు. వారికి ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. ట్యాంకర్ల ద్వారా కృష్ణ జలాలను కిడ్నీ బాధిత తండాలకు అందించామన్నారు. ఫెర్రి నుండి ఏ కొండూరు తండాలకు కృష్ణ జలాలు అందించాలని ఆనాడు రూ.26 కోట్లు కేటాయించామన్నారు.
టిడిపి హయాంలో!
తెలుగుదేశం ప్రభుత్వంలో డయాలసిస్ పేషెంట్లకు రూ.3 వేల నుండి రూ.10 వేల వరకు అందించామన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే రక్షణనిధి నేను ఏమి చేయలేను అని చేతులు పైకి ఎత్తి వేశారని విమర్శించారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీసం కిడ్నీ బాధితులు ఉన్న గ్రామీణ ప్రాంతాలను సందర్శించిన పాపాన పోలేదని ఆరోపించారు.
నిద్రపోతున్న వైసీపీ ప్రభుత్వం!
ఈ ప్రాంతంలో కిడ్నీ బాధితులు 300కు పైగా పిట్టలు రాలినట్టు రాలిపోయారన్నారు. కనీసం అసెంబ్లీ సమావేశంలో కిడ్నీ సమస్యలపైన ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడక పోవడం మన దౌర్భాగ్యమన్నారు. ఏ కొండూరలో తెలుగుదేశం ప్రభుత్వం కిడ్నీ మరియు డయాలసిస్ హాస్పిటల్ నిర్మాణానికి నిధులు కేటాయించే లోపు ఎన్నికల కోడ్ రావడం జరిగిందని ఉమా అన్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.

వేల సంఖ్యలో ఉన్న కిడ్నీ బాధితులకు ఈ వైసీపీ ప్రభుత్వం ఇటువంటి సహాయం చేయకపోవడం మూర్కత్వానికి నిదర్శమని అన్నారు. మొద్దునిద్రలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధిని నిద్ర లేపడానికి అఖిలపక్షం నిరసన దీక్ష చేపట్టిందని పేర్కొన్నారు. దేవినేని ఉమా వెంట టిడిపి ఇన్‌ఛార్జి శావల దేవదత్, టిడిపి నాయకులు చెరుకూరి రాజేశ్వరరావు, పుల్లయ్య చౌదరి, గడ్డి కృష్ణా రెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!