Khammam Suda Chairman ఖమ్మం: క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతో మేలు చెస్తాయని సుడా చైర్మెన్ బచ్చు విజయకుమార్ పేర్కొన్నారు. సమాజంలో మనిషి మానసిక వికాసానికి క్రీడలను ప్రొత్సహించాలని ఆయన వివరించారు. స్ఫూర్తి షటిల్ టోర్నమెంట్ కమిటి ఆద్వర్యంలో యన్ యస్ పి క్యాంపు సందు జరిగిన బహుమతి ప్రాధానొత్సవ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిచారు. కీ. శే. ముత్యం కొమరయ్య జ్నాపకార్దమ్ జరిగిన సభకు 52వ డివిజన్ కార్పొరేటర్ బుర్రి వెంకటేశ్వర్లు (వెంకట్ కుమార్) అధ్యక్షత వహించారు. ఈ సభలొ 2 టౌన్ సిఐ శ్రీధర్ గారు మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణతో, మానసిక ఉల్లాసాన్ని పట్టుదలను కృషి చేస్తాయని ఆయన(Khammam Suda Chairman) వివరించారు.

అనంతరం క్రీడలలో ప్రథమ బహుమతి గెలుపొందిన బానోత్ భాస్కర్, రమేష్, బాలాజి లకు, ద్వితీయ బహుమతి గెలుపొందిన చందూ, విష్ణు, అభిరామ్ లకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ హృదయ్ కరస్పాడెంట్ వి. సాంబ శివ రెడ్డి, అర్బన్ ఆర్ ఐ పగడాల రాజేష్, మాజీ కౌన్సిలర్ నర్రా రమేష్, dyfi జిల్లా ఉపాద్యక్షులు బి. ఉపెందర్ నాయక్, ముత్యం క్రాంతి కుమార్, గుడిపూడి శ్రీనివాస్ రావు, మొయినుద్దిన్, కిన్నెర లక్ష్మణ్, పుష్పరాజ్, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ