Cotton Rate today 2022 ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు రోజురోజుకూ దూసుకెళుతున్నాయి. మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా తెల్ల బంగారానికి రికార్డు ధర పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏకంగా క్వింటాల్‌కు రూ.10 వేలు పలికి ఆల్‌టైం రికార్డ్‌కు చేరింది. ఈ వ్యవసాయ మార్కెట్లో ఎప్పుడూ లేనంతగా క్వింటాల్‌కు రూ.10 వేలు చేరడం ఇదే తొలిసారి అని రైతులు(Cotton Rate today 2022) చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి అభిషేకం!
ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం పత్తి (Cotton Rate)మార్కెట్ నందు రైతుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పత్తితో అభిషేకం నిర్వహించారు. పత్తితో మన రైతు బంధు కేసీఆర్ అని రాసి కృతజ్ఞతలు తెలిపారు. ఎఎంసీ ఛైర్మన్ లక్ష్మీ ప్రసన్న, మార్కెట్ సెక్రటరీ మల్లేష్, మంత్రి పిఎ సిహెచ్. రవికిరణ్ ఆధ్వర్యంలో మార్కెట్ నందు సంబురాలు నిర్వహించారు.

మంచి లాభసాటి ధర రావడంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వారు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతు పెట్టుబడి సాయంతో నేడు వ్యవసాయం సాఫీగా చేసుకోగలుగుతున్నారని అన్నారు. ఈ సారి పత్తి దిగుబడి తక్కువ రావడంతో రేటు ఎక్కువ ఉంటుందని రైతులు, వ్యాపారులు భావించారని వివరించారు. గ్లోబల్ మార్కెట్లో భారతీయ నూలుకు అధిక డిమాండ్ ఉన్నందున ధర పెరిగే అవకాశం లేకపోలేదన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ