ఎఐటియుసి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
AITUC : జిన్నింగ్ మిల్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలిKhammam: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిన్నింగ్ మిల్ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎఐటియుసి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, ఎఐటియుసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్లో ఉన్న జి.ఆర్.ఆర్ జిన్నింగ్ మిల్ ఎదుట నూతనంగా నిర్మించిన, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కార్మికోద్యమ రథసారథి ఎఐటియుసి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిన్నింగ్ మిల్ హమాలీ కార్మికులకు పని భద్రత కల్పించి, ఎగుమతి, దిగుమతిలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని హమాలీలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడకల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎఐటియుసి హమాలీ కార్మికుల సమస్యలపై నిరంతరం అలు పెరగని పోరాటాలు నిర్వహిస్తూ అనేక సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.


ఈ నేపథ్యంలో నేడు జిన్నింగ్ మిల్లు ఎదుట జెండా ఆవిష్కరణ నిర్వహించడం సంతోకరమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం అని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా చాలీచాలని ఎగుమతి, దిగుమతులకు గిట్టుబాటు రేటు అందక కుటుంబాలు దయనీయ స్థితిలో బ్రతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఎగుమతి దిగుమతులకు సరైన రట్లు చెల్లిస్తున్నారని, అందుకు భిన్నంగా ఖమ్మం జిల్లాలో పలు జిన్నింగ్ మిల్లుల్లో మాత్రం యాజమాన్యం తనకు నచ్చిన పద్ధతుల్లో రేట్లు చెల్లిస్తున్నారని తెలిపారు. అడిగే వారు లేక యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరును ఎఐటియుసి తీవ్రంగా విమర్శిస్తుందన్నారు. జిన్నింగ్ మిల్లుల్లో ఎటువంటి రక్షణ లేకుండా పనిచేస్తున్న కార్మికులకు సరైన రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. యాజమాన్యం సరైన రేట్లు నిర్ణయించి చెల్లించేలా హమాలీలకు పి.ఎఫ్ సౌకర్యాలు కల్పన కోసం రానున్న రోజుల్లో కార్మికోద్యమ రథసారథి ఎఐటియుసి కార్మిక సంఘం పోరాట స్ఫూర్తితో దశలవారీగా ఆందోళనలకు హమాలీ కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో జిన్నింగ్ మిల్ హమాలీ కార్మిక సంఘం నాయకులు టి.ప్రభాకర్, ఉపాధ్యక్షులు లింగమల్లు, ప్రధాన కార్యదర్శి వి.ప్రసాద్, సహాయ కార్యదర్శి నరేష్, కార్యదర్శి జి.శ్రీను, బి.రాజు, కోశాధికారి వినోద్, సభ్యులు జి.చిన్న శ్రీను, సత్యనారాయణ, బాలు, అశోక్, యం.వెంకటేశ్వర్లు, నాగరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి:భారత దేశంలో కార్మిక ఉద్యమ చరిత్ర పూర్వ పరిస్థితి!
ఇది చదవండి: జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
ఇది చదవండి:మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్