khammam bsp

khammam bsp: అసెంబ్లీపై నీలి జెండాను ఎగ‌రేయాలే!

Telangana
Share link

khammam bsp: ఖ‌మ్మం అసెంబ్లీలో బీఎస్పీ గెలుపుకై ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ అల్లిక వెంక‌టేశ్వ‌ర‌రావు గురువారం ఓటు చైత‌న్య యాత్ర‌ను ప్రారంభించారు. ఖ‌మ్మం ముస్త‌ఫా న‌గ‌ర్‌లో గ‌ల అబ్దుల్ క‌లాం విగ్ర‌హం ద‌గ్గ‌ర నుండి ప్రారంభ‌మైన ఖ‌మ్మం అసెంబ్లీపై నీలి జెండాను ఎగరేయాల‌ని బ‌హుజ‌నులంద‌రినీ ఏకం చేసి ఖ‌మ్మం అసెంబ్లీలో BSP గెలుపును కాంక్షిస్తూ ప్రారంభ‌మైంది.

ఓటు చైత‌న్య యాత్ర‌ను KHAMMAM జిల్లా బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ అల్లిక వెంక‌టేశ్వ‌ర రావు జెండాను ఊపి యాత్ర‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఖ‌మ్మం అసెంబ్లీ ప‌రిధిలోగ‌ల బ‌హుజ‌నులంద‌రూ ఏకం కావాల‌ని బ‌హుజ‌న రాజ్యం స్థాపించుట‌కు BSP పార్టీని గెలిపించాల‌ని అన్నారు. బీఎస్పీ పార్టీ గెలిస్తేనే మ‌న బ‌హుజ‌నులంద‌రికీ విద్య వైద్యం ఉపాధి రైతుల‌కు లాభ‌దాయ‌క‌మైన‌టువంటి గిట్టుబాటు ధ‌ర భూమిలేని పేద‌ల‌కు ప్ర‌తి ఇంటికి ఎక‌రం భూమి కౌలు రైతులంద‌రూ రైతుబంధు క‌ల్పించాల‌ని బీఎస్పీ పార్టీ అధికారంలోకి రాగానే వీట‌న్నింటినీ 100% నెర‌వేస్తామ‌ని వారు అన్నారు.

Khammam: అబ్దుల్ క‌లాం విగ్ర‌హం

khammam అసెంబ్లీలో త‌ర‌త‌రాల నుంచి ఆధిప‌త్య కులాలే గెలుస్తూ BC ల‌కు అవ‌కాశం క‌ల్పించ‌కుండా బీసీల‌ను అణ‌గ‌దొక్కుతూ తీవ్ర‌మైన దోపిడీ అన్యాయానికి గురి చేస్తున్నారన్నారు. ఈ విధానం మారాలంటే ఖ‌మ్మం అసెంబ్లీలో బీసీ బిడ్డ‌ను గెలిపించాల‌ని వారి సంద‌ర్భంగా ఖ‌మ్మం ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఖ‌మ్మం అసెంబ్లీ ఇంఛార్జి కుక్క‌ల కృష్ణ‌, ఖ‌మ్మం అసెంబ్లీ అధ్య‌క్షుడు ఉపేంద‌ర్, మ‌హిళ‌లు బానోతు ర‌జిని, ఉప్ప‌ల, మంజుల‌, అనిత వివిధ ముస్లిం సామాజిక వ‌ర్గాలు బ‌హుజ‌నులు పాల్గొన్నారు.

See also  Abortion gang arrested | Gender determination test | న‌ల్గొండ‌లో అబార్ష‌న్ ముఠా అరెస్టు

Leave a Reply

Your email address will not be published.