Tumour operation: Khammam: నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రం ఎదురుగా ఉన్న ప్రముఖ బ్రింద ఆసుపత్రిలో శనివారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంకు చెందిన ఆర్.నాగమణి(45) అనే మహిలలకు గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పి తో బాధపడుతుంది. ఖమ్మంనగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. హైద్రాబాద్ వెళ్లాల్సిందిగా పలు డాక్టర్లు సూచించారు. చివరకు ఈ విషయం తెలుసుకున్న మహిళా తాలుకూ బంధువులు బ్రింద ఆసుపత్రికి వచ్చి వైద్యులను సంప్రదించారు. ఆ మహిళకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో గర్భసంచికి 8 కేజీల కణితి ఉన్నట్టు, అదే విధంగా మెడలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించారు.
న్యూరో ఫిజిషియన్ డాక్టర్ డి.ఈశ్వర్, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రోజాకిరణ్, డా. రవికుమార్, డా.చంద్రహాస్ ఆధ్వర్యంలో వైద్య బృందం శ్రమించి 8 కేజీల కణితిని తొలగించారు. ప్రాణాపాయంలో ఉన్న ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. గతంలో కూడా ఈ ఆసుపత్రిలో పలు శస్త్ర చికిత్సలు విజయంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి వైద్యులు సాహోసోపేతమైన ఆపరేషన్ ను సక్సెస్‌ఫుల్‌గా చేసి మహిళ ప్రాణాలను కాపాడినందుకు బ్రింద ఆసుపత్రి డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వైద్యులను అభినందించారు.
ఇది చదవండి:రైతు గొప్పతనాన్ని తెలిపిన శ్రీకారం మూవీ సాంగ్ సూపర్!
ఇది చదవండి:వెంకన్న సన్నిధిలో భక్తులకు పెద్దపీట!
ఇది చదవండి:బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన విలేకర్లు అరెస్టు
ఇది చదవండి:ప్రస్తుతం డిమాండ్ ఎక్కువుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి తెలుసుకోండి!