kgf 2 movie | కె.జి.యఫ్ ఛాప్టర్ 2 సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. కె.జి.యఫ్కు మించిన బడ్జెట్, మొదటి సినిమా కన్నా రెండో సినిమాలో కొత్త స్టార్లతో చాప్టర్ 2ను ముస్తాబు చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మరీ ఈ చాప్టర్లో ప్రశాంత్ నీల్ ఏం రాశాడు, ఏం తీశాడు?. రాఖీభాయ్ ప్రేమలో మరోసారి సినీ ప్రేమికులు పడిపోయారా? పలు రకాల మీడియా సంస్థలు ఏం చెప్పాయో ఇప్పుడు చూద్ధాం!.
kgf 2 movie | కె.జి.యఫ్-2 కథ ఎలా ఉంది?
ముంబైలోని ఓ సాధారణ కుర్రాడు బంగారు గనుల సామ్రాజ్యం నరాచిని ఎలా సొంతం చేసుకున్నాడనేది కె.జి.యఫ్ 1లో చూపించారు. ఆ సామ్రాజాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఏం జరిగిందో చాప్టర్ 2లో చూపించారు దర్శకుడు. ఇక్కడ రాఖీకి కొత్తగా శత్రువులు పుట్టుకొస్తారు. ఎప్పుడో చనిపోయాడనుకున్న అధీర రాఖీని మట్టుబెట్టి నరాచీని కైవసం చేసుకోవడానికి కంకణం కట్టుకుంటాడు. ప్రభుత్వం మారడంతో ప్రధాని పీఠం రమిక సేన్ చేతికి చిక్కుతుంది. ఆమె కూడా కె.జి.యఫ్పై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఈ ఇద్దరి నుంచి రాఖీ తనను తాను ఎలా కాపాడుకున్నాడు?. వాళ్లని ఎలా ఎదురించాడు. ఇదే కె.జి.ఎఫ్ 2 కథ.
ఈ సినిమాలో దర్శకుడు ఎప్పటిలాగానే ఎలివేషన్లు నమ్ముకున్నాడు. యష్(yash) ఎంట్రీ, ఇంట్రవెల్ వెర్షన్, బంగారు బిస్కెట్ తిరిగి తీసుకురావడం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లే సీన్ వేరే లెవల్లో ఉంటాయి. రాఖీ అనే పాత్రకు ఇంత క్రేజీ రావడానికి కారణం దర్శకుడు మలిచిన విధానమే అని చెప్పవచ్చు. అధీర అనే విలన్ పాత్ర ఏర్పాటు చేయడం, దానికి సంజయ్‌దత్‌ను ఎంచుకోవడం సినిమాకు మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కలర్ టోన్ ఇది వరకు ఎప్పుడూ చూసి ఉండరు. కెమెరా, ఫోటో విభాగాలు పోటీ పడి పనిచేశాయి.

బ్యాగ్రౌండ్ స్కోర్, థీమ్స్ వెనుక వినిపించే మ్యూజిక్ మరింత అద్భుతంగా ఉంది. మొదటి సినిమాకు సినిమాటోగ్రఫీనే ప్రాణం అని మీడియా సంస్థలు తెలిపాయి. కథకు తగ్గట్టుగా కెమెరా పనితనం భువన్ గౌడ ఆకట్టుకున్నాడు. భువన గౌడ కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలో సీన్లకు తీసిపోని విధంగా ఉంది. ఈ సినిమాలో యశ్ చాలా స్టైల్‌గా కనిపించాడు. చూపుల్లో, బాడీ లాంగ్వేజీలో తన స్టైల్ బాగుంది. మొదటి సినిమాలో లాగానే యష్ పాత్ర రెండో సినిమాలో కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. మొదటి భాగం కంటే రెండో భాగంలో హీరోయిన్ శ్రీనిధి శెట్టికి స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. కె.జి.ఎఫ్ సినిమా స్టోరీ అసలు భాగం ఎక్కువగా చాప్టర్ 2లోనే ఉందని దర్శకుడు చెబుతున్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ