Kesineni Nani:ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని విజయవాడ MP కేశినేని నాని ఆదివారం పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు mlc, టిడిపి క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ బచ్చుల అర్జునుడు. అయితే అతన్ని ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కలిసి పరమార్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అర్జునుడికి అందున్న వైద్యంపై Ramesh ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అదే సమయంలో అర్జునుడి కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపి అర్జునుడు కోలుకుంటాడని తెలిపారు. అనంతరం ఎంపీ నాని మీడియాతో మాట్లాడారు.
Kesineni Nani: క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి అర్జునుడు!
ఎంపీ నాని మాట్లాడుతూ ఎమ్మెల్సీ Arjunudu చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి అని, క్రమ శిక్షణ, నిజాయితీ కలిగిన నాయకుడు అని కొనియాడారు. ఎప్పుడూ చాలా ఉత్సాహంగా, సంతోషంగా TDP పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే గొప్ప వ్యక్తి ఎమ్మెల్సీ అర్జునుడు అని గుర్తు చేశారు. అలాంటి మంచి నాయకుడు ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూడటం చాలా బాధాగా ఉందని అన్నారు.
అర్జునుడు గారు వైద్యానికి స్పందిస్తున్నారని అన్నారు. ఇంకా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని కోరడం జరిగందని నాని అన్నారు. అర్జునుడు త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి తిరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ Kesineni Nani తో పాటు టిడిపి సీనియర్ నాయకులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, కోగంటి రామారావు, లింగమనేని శివరాం ప్రసాద్, జాస్తి సాంబశివరావు, కోనేరు సందీప్, లక్ష్మీ నారాయణ, కాకుల మల్లికార్జున్, కోనేరు రాజేష్ Thaditharilu పాల్గొన్నారు.

