kerala lockdown: దేశంలో కేరళలోని కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ 20 వేలకు పైన కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడ ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షల వైపు అడుగులు వేస్తోంది.
వారాంతంలోని సంపూర్ణ లాక్డౌన్(kerala lockdown)ను విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఆంక్షలు జూలై 31, ఆగష్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పరిస్థితులను పరీక్షించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యులు బృందాన్ని కేంద్రం కేరళకు పంపనుంది.
కేరళలో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌పై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న పోరులో ఈ బృందం సహకరించనుంది. అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. రెండో దశలో ఉగ్రరూపం దాల్చిన కరోనా, మే చివరి నుంచి అదుపులోకి రావడం ప్రారంభించింది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 10 వేలకు పైగా బయటపడుతున్నాయి. ఆ సంఖ్య ఇప్పుడు 20 వేల మార్కును దాటింది. రోజువారీ కేసుల్లో దాదాపు సగం కేసులు ఒక్క కేరళలోనే రావడం ప్రభుత్వాలను కలవరపెడుతోంది.