keralaకేరళలో భారీ సెక్స్ రాకెట్ స్కాడింల్ గుట్టు రట్టయింది. లైంగిక వాంఛ తీర్చుకోవడానికి భాగస్వాములను మార్చుకుంటున్న వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. ఈ ఘటనతో సంబంధమున్న ఏడుగురిని అరెస్టు చేశారు. వెయ్యికి పైగా జంటలకు ఈ వ్యవహారంతో సంబంధాలున్నట్టు(kerala) అధికారులు తెలిపారు.
ధనవంతుల పిల్లలే ఎక్కువ!
ఈ కేరళ సెక్స్ రాకెట్లో ఎక్కువుగా ధనవంతుల పెద్ద మనుషల పిల్లలే ఉన్నారని తెలుస్తోంది. లైంగిక సుఖం కోసం కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా తమ భార్యల్ని మార్చుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. కేరళలో వెలుగు చూసిన ఈ దారుణ సంఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ రాకెట్లో దాదాపు 1000 మంది జంటల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
శృంగారం కోసం బలవంతం!
కేరళలోని కరుచాకల్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను లైంగికంగా వేధించేవాడు. అంతటితో ఆగకుండా అసహజ రీతిలో శృంగారం చేయాలని బలవంతం చేసేవాడు. ఈ రీతిలో ప్రతిరోజు భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెపై పశువాంఛను తీర్చుకునేవాడు. కొంత కాలానికి ఆ వ్యక్తి ఆగడాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అతను మరికొందరితో కలిసి ఓ గ్యాంగ్ మాదిరిగా ఏర్పడ్డాడు. ఈ గ్యాంగ్‌లో ఏడుగురు సభ్యలున్నారు.

భార్యలను మార్చుకునే పద్ధతి
ఈ ఏడుగురితో కూడా తన భార్యను లైంగిక చర్యకు సహకరించాలని బలవంతం చేశాడు. వీరిలో కొందరు తమ భార్యలను ఒకరితో మరొకరు మార్చకుంటూ అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవారు. ఈ క్రమంలో సదరు మహిళ భర్త చేష్టలతో విసిగిపోయి వేరే వ్యక్తులతో అసహజ లైంగిక చర్యకు నిరాకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు!
మహిళ ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు, మరో 25 మందిని విచారిస్తున్నారు. రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందటున్నారు పోలీసులు.

షాకింగ్ విషయాలు వెలుగులోకి!
వీరి విచారణలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా టెలిగ్రామ్, మెసెంజర్లతో సంప్రదించుకునేవారని పోలీసులు గుర్తించారు. వీరి పార్టనర్ స్వాపింగ్ చాట్ గ్రూప్‌లో వేలాది మంది యువతి, యువకులున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో బృందాలుగా విడిపోయిన పోలీసులు నిందితులను మూడు జిల్లాల నుంచి అరెస్టు చేశారు. ప్రస్తుతం సెక్స్ రాకెట్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ సెక్స్ రాకెట్లో డబ్బు చేతులు మారు తున్నట్టు పేర్కొన్నారు. ఈ గ్రూపులో చాలా మంది పేరుగల్ల వారు కూడా ఉన్నారు. ఇంతకుముందు కూడా కేరళలో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!