KCR vision Golden India| హైదరాబాద్: కేంద్రంపై పోరు విషయంలో తగ్గేదేలేంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇన్నాళ్లూ బంగారు తెలంగాణ కోసం పాడుపడిన తాను ఇకపై బంగారు భారత్(Bangaru Bharat) నిర్మాణం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. అమెరికా కంటే గొప్పదేశంగా భారత్‌ను తీర్చిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. సోమవారం రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన(KCR vision Golden India) చేశారు.
బంగారు తెలంగాణాలాగే, బంగారు భారత్.. ఇదీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఇచ్చిన నినాదం. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సీఎం మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో పరిస్థితులు ఉండాల్సిన విధంగా లేవన్నారు కేసీఆర్. అంతే కాకుండా, కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే దందా నడుస్తోందని మండిపడ్డారు. ఇది మారాలంటే జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సత్తా చూపాల్సిందేనన్నారు.

సంగారెడ్డి పర్యటన ఇలా!
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నరలో ఈ లిప్టు ఇరిగేషన్లో నీళ్లు దుముకాలనీ, జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ నీళ్లు పారాలనీ మంత్రి హరీష్‌ను అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయ్యేదాకా, అధికారులు, కాంట్రాక్టర్ల వెంటబడాలని చెప్పారు.

గొప్పదేశంగా భారత్!
అమెరికా కంటే గొప్పదేశంగా భారత్‌ను తీర్చిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. అందుకు అవసరమైన శక్తి, దేశానికి పుష్కలంగా ఉందన్నారు కేసీఆర్. ఆ దిశగా జాతీయ రాజకీయాల్లో ముందుకు సాగుదామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. నారాయణఖేడ్ సభా వేదికగా సంగారెడ్డి జిల్లాపై వరాలు కురిపించారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీకి వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తానన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీకి 50 కోట్లు, జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలకు 25 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ