kcr third front politics: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు(kcr) జాతీయ రాజకీయాలపై ఎప్పటి నుండో ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం మరింత వేగంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహకర్తగా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు రాజకీయ యుద్ధం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఒక ప్రక్క బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే మరో ప్రక్క ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముంబై వెళ్లిన సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో ఆదివారం(kcr third front politics) భేటీ అయ్యారు.
స్వరం పెంచిన కేసీఆర్!
జాతీయ రాజకీయాల్లో కీలకంగా ప్రస్తుత కాలంలో వినిపిస్తున్న పేరు కేసీఆర్. దేశ ప్రధాని నరేంద్రమోడీపై ఒక్కసారిగా విమర్శల వర్షంతో విరుచుకుపడ్డారు. అంతే కాకుండా స్వరం పెంచి దేశ వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టుకుని జాతీయ పార్టీ పెడతానని బాంబు పేల్చారు. గత ఏడాది కాలం నుంచి సీఎం కేసీఆర్ నోట వినిపిస్తున్న మాట థర్డ్‌ఫ్రంట్. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర విభజన తర్వాత సీఎం అయిన కేసీఆర్ తన రాజకీయాన్ని, పాలనను దేశం మొత్తం చూసేలా చరిత్ర కెక్కారు.
థర్డ్ ఫ్రంట్‌తో తన రాజకీయ కేపాసిటీని పెంచుకునే మార్గంలో బీజేపీపై రాజకీయ యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ చూపు అంతా దేశ రాజధాని ఢిల్లీపైన పడింది. ఇక రాజకీయాలన్నీ అక్కడ నుండే చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కేసీఆర్ దూకుడుకు కలిసి వస్తే అటు బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలు ఇరుకున పడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కంటే బీజేపీనే ప్రధాన బద్ధ శత్రువుగా కనిపిస్తున్నట్టు ఉంది. బీజేపీ వారికి కూడా టిఆర్ఎస్, కేసీఆర్ మాత్రమే ప్రధాన శత్రువులుగా ఉన్నట్టు వారి విమర్శలలోనూ తెలుస్తోంది. మొత్తంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయాణం సజావుగా సాగుతుందా లేదా? అనేది ముందుముందు తెలియాల్సి ఉంది.

సీఎం కేసీఆర్ వెంట ముంబై వెళ్లిన వారిలో ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి.బి పాటిల్, ఎమ్మెల్సీ కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ