Kavali: Police arrested two theif | kavali news in telugu | దేవాలయాల్లో హుండీలే వాళ్ల టార్గెట్
kavali : గత కొన్ని రోజులుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న దేవాలయాల్లో హుండీలు చోరీకి గురవ్వతున్నాయి. ఈ కేసు విషయంలో స్థానిక పోలీసులు నిందితులను పట్టుకోవడం సవాల్‌గా మారింది. దేవాలయాల్లో హుండీలనే వాళ్లు టార్గెట్ చేసినట్టు పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిఘా వేసిన కావలి 1వ పట్టణ పోలీసులు నిందితులను పట్టకున్నారు.
కావలి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా దేవాలయాల్లో హుండీలు పగలగొట్టి డబ్బులు దోచేస్తున్న, ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్టు డిఎస్పీ ప్రసాదురావు మీడియా సమావేశంలో తెలిపారు.
నడింపల్లి గోపి, కొమ్మలపాటి గోవర్థన్ అనే ఇద్దరు పలు దొంగతనాల కేసుల్లో ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దేవాలయాల్లో హుండీలను దొంగలించిన కేసులో పాత నేరస్థులని తెలిపారు.
ఈ మధ్య పట్టణంలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో దొరికిన క్లూస్ ఆధారంగా కావాలి ఆర్టిసి బస్టాండ్ వద్ద నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.28,555 నగదు, రూ.14 వేల విలువగల మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు పాత నేరస్థులని తెలిపారు.
బిట్రగుంట, జలందకి, కావలి రూరల్, అల్లూరు దేవాలయాల్లో హుండీలు చోరీ చేసింది వీరేనని విచారణలో తేలిందన్నారు. వీరి మీద గతంలో కావాలి రెండో పట్టణ పోలీసు స్టేషన్ నందు సస్పెక్ట్ షీట్స్ తెరిచామన్నారు. వీరిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో 1వ పట్టణ సి.ఐ శ్రీనివాస్, ఎస్ఐ కొండయ్య, సిబ్బంది ఉన్నారు.
ఇది చదవండి: టిడిపి నేత దారుణ హత్య