Katla Pamu: భారతదేశంలో ఎన్నో పాముల జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని విషపూరితమైనవి. మరికొన్ని అత్యంత విషపూరితమైనవి. ఆ అత్యంత విషపూరితమైన వాటిల్లో Katla Pamu ఒకటి. ఇంక సముద్ర పాము కూడా విషపూరితమైనదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపించే కట్ల పామును Krait Snake అని కూడా అంటారు. ఇక ఇండియాలో కనిపించే కట్ల పామును ఇంగ్లీష్‌లో Indian Krait అంటారు.
Katla Pamu లు ప్రమాదకరమైనవి
Katla Pamu ఎక్కువగా ఏడాదిలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు ఎక్కువగా మనకు కనిపించొచ్చు. ఈ పామును చూస్తే చాలా beautiful snake గా కనిపిస్తుంది. కానీ విషం మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ పాము వల్ల మనిషికి చాలా ప్రమాదం ఉంది. ఎక్కువగా రాత్రిళ్లు కనిపించే పాముల్లో ఇది ఒకటి. ఈ beautiful snake కాటు వేస్తే కనీసం తెలియదు కూడా. దోమ కుట్టినా మనకు నొప్పి తెలుస్తుంది కానీ, ఈ Katla Pamu కాటు వేస్తే అస్సలు నొప్పి ఉండదు.
ఈ Pamu తనను తాను రక్షించుకునేందుకు, ముఖ్యంగా ఏదైనా ప్రమాదం పొంచి ఉందని తనకు తెలిసినప్పుడు వెంటనే చుట్ట చుట్టుకొని తలని శరీరం కింద దాచుకుంటుంది. అలా భయపడుతూనే అవకాశం దొరికితే చిన్నగా జారుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కట్ల పాము కాటు వేసిన చోట గాట్లు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఈ పాము ఎక్కువగా వెచ్చదనాన్ని కోరుకుంటుంది. అన్ని పాము (Pamu) లాగానే పొడి ప్రదేశంలో ఉండాలని చూస్తుంది. అందుకనే మన పాత కాలపు ఇళ్లల్లో అనగా పూరిళ్లల్లో ప్రజలు కింద నేలపైన నిద్రించినప్పుడు ఆ ప్రదేశంలోకి చేరుకుంటుంది.
ఈ పాము కాటు వల్ల ఎంతో మంది పల్లెటూరులల్లో ప్రజలు త్వరగా చికిత్స అందక చనిపోతున్నారు. ఈ Katla Pamu విషం ఎక్కువగా మనిషి నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. అందుకనే మనిషి త్వరగా ప్రమాదకర స్థితిలోకి చేరుకుంటాడు. త్వరగా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పాము కాటేసిన వారిలో ఎక్కువ శాతం బ్రతికిన వారు చాలా తక్కువనే చెప్పాలి. ఈ Krait Snake తోటి పాములను తినే బుద్ధి ఉంది. అందుకేనేమో ఇది బలమైన విష పురుగుగా మారింది.


ఇక Pamulu అన్ని సాధారణంగా మనిషికి కావాలని హాని తలపెట్టవు. మనిషి పామును చూసి భయపడు తుంటాడు. అదే విధంగా పాములు మనిషి చూసి కూడా భయపడుతుంటాయి. వాటి మనుగడ కోసం శత్రువుల నుండి రక్షించుకునే క్రమంలో కాటు వేస్తాయి. అన్ని పాములు విష పూరితమైనవి కావు. కాబట్టి పాములను సాధ్యమైనంత వరకు చంపకూడదని మనవి. ఒక వేళ కాటు వేస్తే ఆ వ్యక్తికి సాధ్యమైనంత త్వరగా first aid treatment అందేలా చూడాలి. ఎక్కువగా పొలాల్లో పనులు వెళ్లే వారు, పూరిళ్లల్లో నివసించే వారు, కింద పడుకునే వారు జాగ్రత్తగా ఉంటే మంచిది.