Kasinath Tata | తాతా కాశీనాధ్ స్వస్థలం అమలాపురం దగ్గర ఇందుపల్లి. 35 సంవత్సరాల కిందట కాకినాడలో జన్మించారు. కాకినాడలోనే Inter మీడియేట్ వరకూ చదువుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే నాటకాల్లో పాల్గొంటూ ఉండటం వల్ల ఆ అభిలాష అలా ఎక్కువైంది. ఆ అభిలాష తోనే ఆయన మద్రాసు వచ్చి 1952 నుంచీ సినిమా వేషాల్లో వేస్తున్నారు. చాలా dubbing చిత్రాలలో గాత్రధారణ కూడా చేశారు. Radio నాటకాల్లో కూడా Kasinath గొంతు వినిపించింది.
10 సంవత్సరాల నాటకానుభవంలో రకరకాల పాత్రలు ధరించడతో, మిమిక్రీ విద్య కూడా ఆయనకు అలవాటయింది. రకరకాల గొంతులను అనుకరించడం వంటి కార్యక్రమాలు ఆయన తరుచుగా కాలేజీల్లోనూ, స్కూళ్లలోనూ ఇచ్చేవారు. Kasinath Tata కొన్ని Kannada చిత్రాల్లో మంచి పాత్రలు వేశారు. లేత మనసులులో రంగూన్‌లోని వ్యాపారి పాత్ర, భక్త ప్రహ్లాద లోని బ్రహ్మ పాత్ర చూస్తే కాశీనాథ్ జ్ఞాపకం వస్తారు. మద్రాసులో ప్రదర్శింపబడిన కళత్రం, మహానటుడు నాటకాల్లో కాశీనాథ్ తండ్రి పాత్రలు ధరించి మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 70కు పైగా చిత్రాల్లో కాశీనాథ్ నటించారు.