Karthika Masam 2020 Telugu Calendar I నిరంత జ్యోతి వెలిగే వైభవమైన కార్తీక మాసం ప్రారంభం!
దీపావళి పండుగ వస్తూనే ఆధ్యాత్మిక పరిమళాన్ని తనతో తీసుకువస్తుంది. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనదని పండితులు చెబుతారు. ఇటు శివ భక్తులు, అటు వైష్ణవి ప్రియులు కూడా కార్తీక మాసాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివాలయాల్లో దీపతోరణాలు, ఆకాశదీపాలు, ప్రత్యేక అభిషేకాలు, పూజలు కనుల పండువగా నిర్వహిస్తారు. ఇక భక్త జనకోటి తెల్లవారుజామున చన్నీటి స్నానాలు, ఉపవాస దీక్షలు, మహిళా భక్తులు కేదారేశ్వర నోములు చేస్తూ కార్తీక మాసం అంతా చాలా పవిత్రమైన భావనలో దేవుని సేవలో నిమగ్నమైపోతారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కార్తీక మాసంలో సోమవారం మరింత ప్రత్యేక మైనదిగా భక్తులు భావిస్తారు. కార్తీక సోమవారం ఉపవాస దీక్షలు చేస్తారు.
ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు తెల్లవారుజామునే లేచి పూజలు చేస్తుంటారు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మం చెప్పాడు.
![]() |
Karthika Masam 2020 |
కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల గల జన్న పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలిగిపోతాయి. మహిళలు ఈ దీపారాధన చేయడం వల్ల సౌభాగ్యాలు సిద్దిస్తాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్ధేశ్యం.పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో వచ్చే పండుగలు,పర్వదినాలు, ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడో ఉన్నాయో చూద్దాం!
- నవంబర్ 16 న కార్తీక మాసం ప్రారంభం (మొదటి సోమవారం, భగినీహస్త భోజననం)
- నవంబర్ 18 బుధవారం (నాగులచవితి)
- నవంబర్ 20 శుక్రవారం (తుంగభద్ర పుష్కరములు ప్రారంభం)
- నవంబర్ 21న శనివారం( శ్రావణా నక్షత కోటి దీపాల పూజ)
- నవంబర్ 23న రెండో సోమవారం
- నవంబర్ 25న బుధవారం (కార్తీక శుద్ధ ఏకాదశి)
- నవంబర్ 26న గురువారం (చిల్కుద్వాదశి)
- నవంబర్ 28న శనివారం (శనిత్రయోదశి)
- నవంబర్ 29న ఆదివారం కార్తీక పౌర్ణమి (జ్వాలాతోరణం)
- నవంబర్ 30న మూడో కార్తీక సోమవారం, (పౌర్ణమి)
- డిసెంబర్ 4వ తేదీన శుక్రవారం (సంకష్టహర చతుర్థి)
- డిసెంబర్ 7వ తేదీన నాల్గో సోమవారం.
- డిసెంబర్ 10వ తేదీన గురువారం (ఉపవాస ఏకాదశి)
- డిసెంబర్ 11వ తేదీన శుక్రవారం (గోవత్సద్వాదశి)
- డిసెంబర్ 12వ శనివారం (శనిత్రయోదశి)
- డిసెంబర్ 13వ తేదీన ఆదివారం (మాస శివరాత్రి)
- డిసెంబర్ 14వ తేదీన సోమవారం అమవాస్య (సోమవార వ్రతం)
- డిసెంబర్ 15వ తేదీతో(పోలీస్వర్గం) తో పూజలు పూర్తి అవుతాయి.