Karpoora Tulasi

Karpoora Tulasi: ఆధ్యాత్మిక‌ సుగంధం క‌ర్పూర తుల‌సి అని ఎందుకంటారు?

Share link

Karpoora Tulasi | తెల్ల‌ని లేక లేత గులాబీ రంగు పూల‌ను పూసే ఈ మొక్క పుష్పాల‌లోని మ‌క‌రందం కోసం తేనెటీగ‌లు బాగా ఆక‌ర్షితుల‌వుతాయి. మొక్క పైభాగ‌మంతా సువాస‌న క‌లిగి ఉన్నా న‌లిపిన ఆకుల నుంచి మాత్రం ఘాటైన ఇంపై, ఉత్తేజ‌ప‌రిచే వాస‌న‌లు వెద‌జ‌ల్లుతుంది. ప్ర‌ధానంగా ఆకుల నుండి తీసిన తైలంలో కేంఫ‌ర్ శాతం 60 నుంచి 80 వ‌ర‌కు ఉంటుంది. Karpoora Tulasi తైలంలో హృద‌యాన్ని ర‌జింప‌చేసే సుగంధ స‌వాస‌న‌ల‌కు కార‌ణం అందులో కేంఫ‌ర్‌, కేంఫీన్‌, ట‌ర్‌పినోలీన్‌, లియోనీన్‌, సినియోల్‌, అల్ఫా-ఫైనీన్‌, బీటా-మైర్సిన్‌, ఆసిమిన్‌, కారియోఫిల్లీన్ వంటి ర‌సాయ‌నాలు ఉండ‌ట‌మే.

Karpoora Tulasi లో పైన తెలిపిన వాటితో పాటు ఫ్లావోనాయిడ్లు, టానిన్లు, సాపోనిన్లు, స్టిరాల్స్ వంటి కెమిక‌ల్ కాంపౌండ్లు ఉన్నాయి. వీటి కార‌ణంగానే క‌ర్పూర తుల‌సి అనేక ఔష‌ధీయ విలువ‌లు క‌లిగి ఉన్నాయి. పూజ‌లు నిర్వ‌హించు ప్ర‌దేశాల‌లో, దేవాల‌యాల‌లో, క‌ర్పూరంతో వెలిగించే జ్యోతులు, వెలువ‌డే పొగ‌లు, మ‌న‌స్సుకు ప్ర‌త్యేక‌త‌మైన ఆధ్యాత్మిక త‌ను, ప‌విత్ర‌త‌ను చేకూర్చ‌డ‌మే కాకుండా ప‌రిస‌రాలు స్వ‌చ్ఛ‌త‌ను ప్ర‌భావితం చేస్తాయి.

క‌ర్పూర తుల‌సిలో ఔష‌ధ గుణాలు

Karpoora Tulasiలో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, Antioxidant గుణాలు అధికంగా ఉండ‌టం వ‌ల్ల అనేక శారీర‌క‌, మాన‌సిక రుగ్మ‌త‌ల‌ను నివారిస్తుంది. దీని ఆకుల ర‌సం నుంచి లేక ఆకులు వేసి మ‌ర‌గ కాచిన వేడి నీళ్ల‌లో నుంచి వెలువడు ఆరోమాటిక్ ఆవిర్లు పీల్చితే జ‌లుబు, ద‌గ్గు, త‌ల‌నొప్పి, ముక్కు దిబ్బ‌డ‌, కంజెస్టెడ్ ఊపిరితిత్తుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఆకుల ఇన్ఫ్యూజ‌న్ శ‌రీరానికి రాసుకుంటే చికెన్ పాక్స్‌, మీజిల్స్ వంటి అంటు వ్యాధులు తీవ్ర‌త‌ను త‌గ్గిస్తుంది. ప్ర‌దేశాల‌ను, ప‌రిస‌రాల‌ను క్రిమి ర‌హితంగా ఉంచి ఆరోగ్య‌ర‌క్ష‌ణ‌కు దోహ‌ద‌కారి అవుతుంది.

జ‌ఠ‌ర దీప్తిని క‌లిగిస్తుంది. అజీర్ణం, క‌ల‌రా, విరోచ‌నాల‌ను అరిక‌డుతుంది. Rosewaterతో క‌లిపి చుక్క‌లుగా వాడితే ముక్కు నుంచి ర‌క్త‌స్రావం, కంటి, చెవి సంబంధిత స‌మ‌స్య‌లు తొలిగిపోతాయి. దోమ‌లు, ఇత‌క‌ర కీట‌కాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా విక‌ర్షించుట‌యే కాకుండా ధాన్యాగార‌, కీట‌క సంహారిణిగా కూడా ప‌నిచేస్తుంది. నోటి దుర్వాస‌న‌ను నివారించ‌డంలో, దంతాల స‌మ‌స్య‌ల‌కు, వాటి ప‌టిష్ట‌త‌కు, Skin కాంతివంతంగా ఉండేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

గుబాళించే సువాస‌న‌!

పెర్‌ఫ్యూమ్‌ల‌లో, సెంటెడ్ సోపుల‌లో, Cosmotic అయిట్‌మెంట్ల‌లో ఈ క‌ర్పూర తుల‌సిని వాడ‌తారు. దీని ఎసెన్షియ‌ల్ తైలాల‌తో కూడిన మ‌స్కిటో రీపెల్లెంట్ ఆయిట్‌మెంట్ ఉత్ప‌త్తులు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. కేంఫ‌ర్ బాసిల్‌ను అనేక సాంప్ర‌దాయ ఔష‌ధాల‌లో ఉప‌యోగించ‌డ‌మే కాకుండా బంగారం ద్రావ‌కాల‌లో క‌లిపి గ్లాస్‌, సిరామిక్ వ‌స్తు సామాగ్రిపై డిజైన్లు చిత్రీకరిస్తారు. ఇన్ని ఉప‌యోగాలు ఉన్న క‌ర్పూర తుల‌సిని ప్ర‌తి ఒక్క‌రూ ఒక మొక్క(Karpoora Tulasi) పెంచుకుని పైన తెలిపిన అవ‌స‌రాల‌కు వాడుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, సువాస‌న కూడా వెద‌జ‌లుతుంది.

marri chettu veru: మ‌ర్రి వేరు వ‌లె మీ శిరోజాలు బ‌లంగా ఉండాలంటే?

marri chettu veru: సౌంద‌ర్యంలో రూపు రేక‌లు ఎంత కీల‌క‌మో, శిరోజాలు కూడా అంతే కీల‌కం. ఆ మాట‌కొస్తే, రూపు రేఖ‌లు ఎంత బాగున్నా, శిరోజాలు ఊడిపోతే Read more

Pasupu: ప‌సుపుతో ఆరోగ్యం ప‌దిలం!

Pasupu : జ‌లుబు, ఒళ్లు నొప్పులు అన‌గానే పెద్ద‌వాల్లు వేడిపాలల్లో కాస్త ప‌సుపు వేసుకుని తాగేయ‌మంటారు. ప‌సుపుకు అంత దివ్య ఔష‌ధ గుణం ఉండ‌బ‌ట్టే మ‌న తాత‌లు Read more

Remove Whiteheads: ముక్కు చుట్టూ స‌మ‌స్య వైట్‌హెడ్స్‌ను ఇలా తొల‌గించుకోండి!

Remove Whiteheads: కొంద‌రికి Blockహెడ్స్ స‌మ‌స్య ఉంటే, మ‌రికొంద‌రిని Whiteheads స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంది. చ‌ర్మంపై చాలా చిన్న‌గా తెల్ల‌ని మ‌చ్చ‌ల్లా క‌నిపిస్తుంటాయి. ఇవి సాధార‌ణంగా అందరి Read more

hemoglobin food: హిమోగ్లోబిన్ పెర‌గాలంటే ఏం చేయాలి!

hemoglobin food | ర‌క్తంలో హిమోగ్లోబిన్ త‌క్కువుగా ఉండ‌టం అనేది ముఖ్యంగా మూడు ర‌కాల కార‌ణాల వ‌ల్ల కావ‌చ్చు. శరీరంలో త‌గిన‌న్ని ఎర్ర ర‌క్త‌క‌ణాలు ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం, Read more

Leave a Comment

Your email address will not be published.