Karnataka road accident in Telugu News | 11 killed | ఇసుక టిప్పర్ రూపంలో కబళించి మృత్యువుKarnataka : కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కనుమ పండుగ రోజు సరాదాగా గడుపుదామని గోవా బయలుదేరిన స్నేహితులు ను ఇసుక టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. వారిలో వ్యాను డ్రైవర్, క్లీనర్లు ప్రాణాలు కూడా పోయాయి.
కర్ణాటక రాష్ట్రంలో దావణగెరెకు చెందిన ఒక లేడీస్ క్లబ్ సభ్యులు సుమారు 17 మంది కలిసి గోవాలో సరదాగా గడుపుతామని శుక్రవారం తెల్లవారుజామున టెంపో ట్రావెలర్లో ప్రయాణమయ్యారు. మధ్యలో ధార్వాడలో స్నేహితురాలి ఇంట్లో అల్పాహారం తీసుకోవాలనుకున్నారు. ఉదయం 7 గంటల సమయానికి వారు ప్రయాణిస్తోన్న వ్యాన్ ఇటగట్టి వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. అందులో మహిళలతో పాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ప్రమాద ఘటన లో చెల్లా చెదురుగా పడిన మృతదేహాలతో ఎటు చూసినా రక్తపు మరకలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. కొన్ని మృతదేహాలు వ్యాన్లో ఇరుక్కుపోవడంతో అతికష్టం మీద మధ్యాహ్నానికి బయటకు తీశారు.
మృతదేహాలను హుబ్లీ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని హుబ్లీ, ధార్వాడల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి ధార్వాడ ఎస్పీ కృష్ణకాంత్, రూరల్ పోలీసులు, అధికారులు వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పొగమంచు వల్ల ఎదుట వాహనం కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
మృతులంతా స్నేహితులే. వీరిలో వీణా ప్రకాష్, ప్రీతి రవికుమార్ వైద్యులు. మిగతా వారు వైద్యరంగంలోనే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. స్నేహితుల మరణంతో దావణగెరె విద్యానగర్, ఎంసీసీ ఏ, బీ బ్లాక్ లేఔట్ లలో విషాధ చాయలు అలుముకున్నాయి. కర్ణాటక లో ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందడంతో ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు.


ఇది చదవండి : వ్యాక్సినేషన్..రూల్స్ మీకు తెలుసా!