Karnataka Farmer kempegowda కర్ణాటక: వేషధారణ చూసి మనుషులను అంచనా వేయకూడదనే పాఠాన్ని మహీంద్రా షోరూమ్ సిబ్బందికి నేర్పాడు కర్ణాటకకు చెందిన కెంపెగౌడ అనే రైతు. వాహానాన్ని కొనేందుకు వెళ్లిన తనను అవమానించిన సిబ్బందితో క్షమాపణలు చెప్పించుకోవడమే కాకుండా వారే ఇంటికి వచ్చి మరీ పికప్ ట్రక్ అందజేశేలా చేశాడు(Karnataka Farmer kempegowda) కెంపెగౌడ.
కర్ణాటక రైతు కెంపెగౌడ ఇంటికి బొలెరో పికప్ ట్రక్ వచ్చి చేరింది. జనవరి 28న హెబ్బూరు పట్టణంలోని ఉన్న రమణపాల్యాలో ఉన్న కెంపెగౌడ ఇంటి వద్దకు వాహనాన్ని మహేంద్రా & మహేంద్రా సంస్థ చేర్చింది. ఈ నెల 21న బొలెరో ట్రక్ కొనుగోలు చేసేందుకు రైతు కెంపెగౌడ తుమకూరులోని మహేంద్ర షోరూంకు వెళ్లారు.అయితే కెంపెగౌడ వేషాధారణను చూసి అక్కడ సేల్స్‌మెన్ అతనని అవమానించాడు. కారు ధర రూ.10 లక్షలు నీ వద్ద రూ.10 కూడా ఉండవంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహానికి గురైన కెంపెగౌడ గంటలో రూ.10 లక్షలతో షోరూంకు వస్తానని వెంటనే వాహనాన్ని డెలివరీ చేయగలరా? అంటూ సవాల్ విసిరాడు.
అన్నట్టుగానే గంటలో రూ.10 లక్షలతో ఆ రైతు మహేంద్ర షోరూంకు వచ్చారు. దీంతో ఖంగుతున్న సేల్స్‌మెన్ వాహనం వెయిటింగ్ లిస్టులో ఉందని, తక్షణమే అందించలేమని చెప్పాడు. తనను అవమానించినందుకు గాను తనకు క్షమాపణలు చెప్పాలని అడిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సేల్స్‌మెన్‌తో రైతుకు క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆనంద్ మహేంద్రాకు ట్యాగ్ చేశారు ట్విట్టర్లో.

స్పందించిన ఆనంద్ మహేంద్ర!
ఈ వీడియోలను చూసిన ఆనంద్ మహేంద్ర స్పందిస్తూ వ్యక్తుల నైతిక విలువలను కాపాడటమే తమ ప్రధాన ఉద్దేశ్యమని సూచించారు. ఈ సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమించిన వారిపై చర్యలు ఉంటాయని ట్విట్టర్లో ట్విట్ చేశారు. మహేంద్ర ప్రతినిధులు కూడా ఘటనపై విచారించి బాధితులపై విచారణ చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా రైతు కెంపెగౌడకు స్వయంగా వాహనాన్ని పంపించడంపై రైతు
సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్రకు, కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!