Karam Podi: వేడి వేడి అన్నంలో కాస్త కారం పొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే..! అబ్బా అ మజానే వేరు కదా!. కారం పొడికి ఉన్న రుచి తిన్నవారికే తెలుస్తుంది. పేదవారింట్లో ప్లాస్టిక్ డబ్బాల్లో కనిపించే కారంపొడి, ధనవంతుల ఇళ్లల్లో పింగాణి పాత్రల్లో కనిపించే కారం పొడి ఒకటిగా ఉన్నా టేస్టులు మాత్రం వేరుగా ఉంటాయి. పొయ్యి మీద ఒండిన వంటకు రుచి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పేద వారింట్లో పొయ్యిల మీద వండి రోటిలో నూరే కారం పొడి టేస్టే వేరు. ఇక Karam Podi ని ఇంట్లో ఎలా తయారు (Recipe) చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం!.
పుదీనా Karam Podi తయారీ
కావాల్సిన పదార్థాలు : పుదీనా (Pudina) ఆకులు – 1 కప్పు, ఎండు మిరపకాయలు – 2, జీలకర్ర – 1/4 టీ స్పూను, ఆవాలు 1/4 టీ స్పూను, మినపప్పు 1/4 టీ స్పూను, వెల్లుల్లి రేకలు -2, ఉప్పు – రుచికి సరిపడా, కారం – 1 టీ స్పూను, నూనె – 1 టీ స్పూను, కరివేపాకు – 1 రెబ్బ.
తయారీ విధానం : బాణలి వేడిచేసి నూనె వెయ్యకుండా పుదీనా ఆకులను తడి పోయేవరకూ వేగించుకోవాలి. తరువాత కారం, ఉప్పు, వెల్లుల్లి, పుదీనా కలిపి మిక్సీ పట్టాలి. ఆ తరువాత బాణలిలో Oil వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, Karivepaku కు వేగించిన పుదీనా కారానికి కలపాలి.
కొబ్బరి కారం పొడి తయారీ
కావల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి తురుము – 250 గ్రాములు, ఎండుమిరప కాయలు – 50 గ్రాములు, వెల్లుల్లి – 1, ఉప్పు – రుచికి సరిపడా, జీలకర్ర – 2 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: ఎండుమిరపకాయలు, జీలకర్రలను నూనె లేకుండా దోరగా వేగించి, ఉప్పు కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత ఈ మిశ్రమానికి ఎండు కొబ్బరి తరుము, వెల్లుల్లి కలిపి కొద్దిగా బరకగా ఉండేట్టుగా మిక్సీపట్టాలి.
కరివేపాకు కారం పొడి తయారీ
కావల్సిన పదార్థాలు : కరివేపాకు – 2 కప్పులు, పచ్చిశనగ పప్పు – 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు, ఎండు మిరపకాయలు – 6, చింతపండు – నిమ్మకాయ పరిమాణంలో సగం, వెల్లుల్లి రేకలు – 6, జీలకర్ర-1 టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, మినపప్పు – 2 టేబుల్ స్పూన్లు, నూనె – 1 టేబుల్ స్పూను.
తయారీ విధానం : కరివేపాకును నూనె లేకుండా వేగించుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి పచ్చిశనగ పప్పు, మినపప్పు, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్రలను ఒక దాని తరువాత ఒకటి దోరగా వేగించుకోవాలి. ఆ తరువాత ముందుగా పప్పులను, తరువాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిలను మిక్సీ పట్టి, చివరలో కరివేపాకు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి.
నువ్వుల కారం పొడి తయారీ
కావాల్సిన పదార్థాలు : తెల్లనువ్వులు – 150 గ్రా, పచ్చి శనగపప్పు – 75 గ్రా, మినప్పప్పు – 75 గ్రా, ఎండుమిర్చి – 8 వెల్లుల్లి రేకలు – 5, జీలకర్ర – 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి తరుము – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 1 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: Endu మిరప కాయలను నూనె లేకుండా బాణలిలో దోరగా వేగించుకోవాలి. తరువాత జీలకర్ర, ధనియాలను కూడా అదే విధంగా వేగించుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనె వేసి పచ్చిశెనగపప్పు, మిన పప్పు, నువ్వులను ఒక దాని తరువాత మరొకటి దోరగా వేగించుకోవాలి. అన్నీ చల్లారక ముందు పప్పు లను, తరువాత ఎండుమిర్చి, Daniyalu, వెల్లుల్లి, నువ్వులను మిక్సీ పట్టి చివరిగా ఉప్పు, ఎండు కొబ్బరి తురుము కలపాలి.