Kanya Rasi 2023: ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నిర్ధేశించేది కాలం. కాలం ఎలా ఉంటే మన పరిస్ధితి అలా ఉంటుంది. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదీ ఉండదు. ప్రకృతి ఎలా ప్లాన్ చేస్తే అలా మనం నడవాల్సి వుంటుంది. కాబట్టి ఆస్ట్రాలజీ మాత్రం లోటు పాట్లు ముందే చెప్పే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రాశులు పరిశీలించుకునేవారు తమ రాశి ఫలం 2023లో ఎలా ఉంది? ఉండబోతుందని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి కన్యరాశి (Kanya Rasi) వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Kanya Rasi 2023: కన్యరాశి ఫలితాలు
కన్యరాశి వారు జనవరి 2023 నుండి 2025 సంవత్సరం ఆగష్టు వరకు టాప్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు. కన్యరాశి వారికి 2022 సంవత్సరంతో కష్టాలన్నీ పోనున్నాయట. కాబట్టి కన్యరాశి వాళ్లు ఇప్పటి నుండి నెంబర్ వన్ పొజిషన్లో ఉండబోతున్నారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారికి శని, గురు గ్రహాలు కలిసి రాబోతున్నాయట.
ముఖ్యంగా 2023 సంవత్సరం కన్యరాశి (virgo horoscope) వారికి ఒక గోల్డెన్ డేస్ ఉండబోతున్నాయట. ఈ ఏడాది ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం కాబోతుందట. గురుడు, శని ఇద్దరూ కలిసి వచ్చే గ్రహాలు అంట. ఇంకా వీరికి తోడు సూర్యడు సమయం కూడా మరింత ఫ్లస్ కాబోతోంది ఈ రాశి వారికి. వాస్తవానికి కన్య రాశి వారికి ఈ 2022 డిసెంబర్ కూడా చాలా బాగుందట. ఆ తరువాత వచ్చే 2023 సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలు కూడా మంచి రోజులు ఉన్నాయట.
ఆ తరువాత 2024 సంవత్సరంలో కన్య రాశి (Kanya Rasi 2023) వారికి జూలై 14 నుంచి ఆగష్టు 14 వరకు చాలా కలిసి వచ్చే నెలలు అంట. కానీ 2023లో ఆగష్టు 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఈ వ్యాపారాలు ఉన్నా అన్నింటిని కాస్త పక్కన పెడితే చాలా మంచిది అంటున్నారు. ఎందుకంటే కన్యరాశి వారికి భాద్ర పదం మాసం వీరికి కలిసి రాదట. ఈ సమయంలో ఏదో ఒక ఇబ్బంది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు ఏదో ఒకటి జరగబోతుందని పేర్కొంటున్నారు.
బాద్రపద మాసం అనగా వినాయక చవితి సమయంలో ఆ రోజుల్లో మాత్రం ఈ కన్యరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ ఒక్క నెలలో మాత్రం ఏదైనా గొడవలు వచ్చే అవకాశం కానీ, ప్రమాదాలు సంభవించే అవకాశం కానీ ఉందట. కాబట్టి ఆ ఒక్క నెల మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా రోజులన్నీ మంచి రోజులే ఉంటాయంటున్నారు.
ఇక చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారు సైతం ఇక తగ్గేదే అనవచ్చు అట. ఎందుకంటే వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెబుతున్నారు. ఒక వేళ వారికి ఉద్యోగం లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదని, వారు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకున్నా కలిసి వస్తుందని అంటున్నారు. వీరు మంచి స్నేహితులతో సంబంధాలు పెట్టుకొని, ఏదైనా కొత్తగా ట్రై చేసినా మంచి ఫలితాలు రాబోతున్నాయట.
కాబట్టి కన్యరాశి (Kanya Rasi 2023) వారు ఏది చేయాలన్నా ఈ సంవత్సరం చాలా గోల్డెన్ డేస్ ఉన్నాయట. మళ్లీ ఆపై వచ్చే ఏడాది కాస్త గురుబలం తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి, ఏమన్నా ఉంటే ఈ ఏడాదే ప్రారంభించుకుంటే మంచిది అని పండితులు చెబుతున్నారు. విదేశాలకు వెళ్లే వారు వెళ్లవచ్చు. ముఖ్యంగా బిజినెస్ చేసే వారికి బాగా కలిసి వస్తుందంట. కొత్తగా ట్రై చేసే ప్రతిదీ కలిసి వచ్చే అవకాశం కన్య రాశి వారికి జనవరి 26 నుండి ప్రారంభమవుతుంది.
ఎక్కువగా డబ్బు సంపాదించాలనుకునే వారికి స్మార్ట్‌గా అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఇక వారికి ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, ఈ కన్య రాశి వారు ప్రతి మంగళవారం గణపతి గుడికి, శనివారం ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇక ఈ ఏడాది వీలైతే కన్యరాశి వారు అరుణాచల ప్రదేశ్ వెళ్లి పౌర్ణమి నాడు గిరిప్రదిక్షణలు చేస్తే మంచిది అంటున్నారు.