Kanuga Oil Wood Pressed | ప్రాచీన కాలం నుండి భారతదేశంలో చెక్క కానుగ నుండే నూనెను తీసుకుని వాడేవారు. చెక్కగానుగలో నూనె తీసినప్పుడు వేడి ఉత్పత్తి కాదు. ఎందుకంటే ఎద్దులతో నడిచే ఈ యంత్రం చాలా నెమ్మదిగా తిరుగుతూ వేడి రాకుండా నూనె గింజలను వొత్తుతూ (ప్రెసింగ్) నూనె బయటకు వస్తుంది. ఇలా వచ్చిన Ganuga Oil లో సూక్ష్మ పోషకాలు పోకుండా 100 కి వంద శాతం శుద్ధమైన నూనె వస్తుంది. ఈ నూనె (Kanuga Oil Wood Pressed) మన వంటల్లో ఉపయోగించి మన పెద్దలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు.
Metal Kanuga oil: మెటల్ కానుగ నూనె అంటే?
ప్రస్తుతం ఈ ప్రాచీన ఆధునిక కాలంలో త్వరితంగా లాభాలను ఆపేక్షించేందుకు బిజినెస్ రంగంలో పాశ్చత్య దేశాల పద్ధతి అయిన మెటల్ గానుగను ప్రవేశపెట్టారు. ఇది మన భారతీయ సాంప్రదాయ, శాస్త్రీయమైన చెక్కగానుక పద్ధతిని క్రమ క్రమంగా పూర్తిగా నాశనం చేసింది. ఈ మెటల్ కానుగ పూర్తిగా ఇనుముతో చేయబడుతుంది. దీని నుండి నూనెలు తీయడం ద్వారా నూనెలోని సూక్ష్మ పోషకాలు నష్టపోతాయి. కారణం ఏమిటంటే?, ఇనుము Ganuga లో వేడి అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ ఉష్ణోగ్రతకు నూనెలోని పోషక విలువలు నశిస్తాయి. శాస్త్రీయంగా నూనె గురించి చెప్పాలంటే ఒకసారి వేడి చేసిన నూనెను రెండవ సారి ఉపయోగించకూడదు.


Kanuga Oil Wood Pressed | ప్రస్తుత జనరేషన్‌లో నూనెలన్నీ ఒకటి రెండు మూడు సార్లు వాడుతుంటారు. ఈ నూనెలన్నీ తయారీ విధంగా మెటల్(ఇనుము) యంత్రాల ద్వారానే. కాబట్టి మెటల్ కానుగ నుండి తీసినవే ఈ పోషకాలు లేని నూనెలను మనం వాడటం వల్ల మనకి అనేక చర్మ సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు, కీళ్ల జబ్బులు తదితర వ్యాధులకు కారణం అవుతున్నాయి. కాబట్టి పూర్వం చెక్క ద్వారా తీసిన గానుగ నూనె(pongamia pinnata) పద్ధతే శ్రేష్టం, ఆరోగ్యానికి శ్రేయస్కరం.
బిజినెస్ రంగంలో Wood Pressed పద్ధతి!
అయితే ప్రస్తుతం business రంగంలో చెక్క కానుగ తయారు చేసే మిషన్లు(Wood Presses Oil Extraction Machine ) కూడా వచ్చాయి. ఈ మిషన్ల ద్వారా ఒక్క గానుక నూనె తయారు చేయడమే కాకుండా వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె కూడా తయారు చేస్తున్నారు. గ్రామీణ ఆరోగ్యం పేరుతో పలు చోట్ల ఇలాంటి మిషన్ల ద్వారా నూనెను ఉత్పత్తి చేసి లాభాలు పెంచుకుంటున్నారు. ఈ చెక్క గానుగ తయారీ మిషన్లలో ఎలాంటి రసాయనాలు కలపకుండా కూడా తయారు చేసే వారు ఉన్నారు. అధిక వేడి లేకుండా కేవలం 10-20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తయారు చేస్తున్నారు.
Kanuga Oil prices ఇలా ఉన్నాయి!
కానుక నూనె మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. ధరలు చూస్తే అదిరి పోతున్నాయి. పలు ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్ల(e commerce websites)లో 100 ఎం.ఎల్ ప్యూర్ కానుక నూనె రూ.213 పలుకుతుంది. మరో రకం 100 ఎం.ఎల్ నూనె రూ.164, 100 గ్రాముల నూనె రూ.400 నుంచి రూ.410 వరకు పలుకుతుంది. మనం వాడే నిత్యవసర ఔషధాలతో పాటు, చర్మానికి, హెయిర్‌కి, తదితర ప్రొడక్ట్స్‌లో ఈ గానుక నూనె వాడుతుండటం వల్ల నూనె మంచి డిమాండ్ ఉంది.