Kanthi Rana Tata IPS విజయవాడ: కృష్ణా జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ బ్యాచ్ (cheddi gang)చోరీలు రోజురోజుకూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో విజయవాడకు కొత్త కమిషనర్ కాంతి రాణా ఎంట్రీ నగరవాసులకు ధైర్యాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఛార్జ్ తీసుకున్న గంటల వ్యవధిలో చెడ్డీ గ్యాంగ్ కేసుపై నిఘా పెట్టారు. చెడ్డీ గ్యాంగ్‌కు చెక్‌పెట్టే క్రమంలో కొత్త పేట పోలీసు స్టేషన్ పరిధిలో జక్కంపూడి సీవీఆర్ ఫైఓవర్ సమీపంలో జరిగిన నేరంపై ఆరా తీశారు. అక్కడ నేరస్థలాన్ని పరిశీలించి , నేరం జరిగిన తీరును తెలుసుకున్నారు. అలాగే బాధితులను కలిసి వారి వివరాలను, యోగ క్షేమాలను (Kanthi Rana Tata IPS)కనుక్కున్నారు.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ కాంతి రాణా మాట్లాడుతూ.. నేరం జరిగిన తీరును తెలుసుకున్నామని, బాధితులను కూడా కలిశామని అన్నారు. నేరాలకు సంబంధించి అన్ని సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా నేరస్థులను గుర్తించేందుకు తమ పోలీసు సిబ్బంది అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ నేరాల విషయంలో ఇతర రాష్ట్ర క్రైం పోలీసుల సహాయ సహకారాలను తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. పోలీసు స్టేషన్ పరిధిలో అన్ని అపార్ట్మెంట్లలోని నేర నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అలాగే సంబంధిత సీఐకు ఆదేశాలు జారీ చేశామన్నారు.


ఇదిలా ఉండగా చెడ్డీ గ్యాంగ్ కు సంబంధించిన కొన్ని అనుమానపు వ్యక్తుల ఫొటోలను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. కృష్ణ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ ఫొటోలను సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పంపించి అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక పోలీసు స్టేషన్ల పరిధిలో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ రాత్రిళ్లు పహారా కాస్తున్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే తమకు ఫోన్ చేయాలని (డయల్ 100) పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!